Home
Mobile

ఐఫోన్ 17 సిరీస్‌ సేల్‌ ప్రారంభం.. ఆపిల్ స్టోర్‌లో రచ్చ రచ్చ.. వీడియో వైరల్‌..!

ఆపిల్‌ ఇటీవల నిర్వహించిన Awe Dropping ఈవెంట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్‌ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్‌ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్స్ సేల్ (iPhone 17 Series Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఆపిల్ ఆఫ్‌లైన్‌ స్టోర్‌లు సహా ఇ-కామర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 17 సిరీస్‌, ఎయిర్ మోడల్‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిలయన్స్ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్, బ్లింకిట్‌ సహా ఇతర ప్రధాన రిటైల్‌ స్టోర్‌ల కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌లతోపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

iphone 17 series

ఆపిల్ స్టోర్‌లో రచ్చ రచ్చ :
ఆపిల్ కొత్త సిరీస్‌ ఫోన్‌ల సేల్ నేపథ్యంలో ముంబై BKC ఆపిల్‌ స్టోర్‌ వద్ద భారీగా రద్దీ నెలకొంది. కొంత మంది ఏకంగా అర్ధరాత్రి నుంచే క్యూలో నిల్చొన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సేల్స్‌ ప్రారంభం కాగా మరింత మంది ఆపిల్‌ స్టోర్‌ వద్దకు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.

ఐఫోన్ 17 సిరీస్‌ కొనుగోలు కోసం భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకుంటూ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ముంబై ఆపిల్ స్టోర్‌ లోపలి పరిస్థితికి సంబంధించిన వీడియోను TeluguScribe తన X ప్లాట్‌ఫాం ద్వారా షేర్ చేసింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.

* ఐఫోన్ 17 మోడల్‌ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.82,900 గా ఉంది. అదే 512GB స్టోరేజీ ధర రూ.1,01,900 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ మార్కెట్‌లో బ్లాక్, మిస్ట్ బ్లూ, లావెండర్‌, సేజ్‌ కలర్ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

* ఐఫోన్‌ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,34,900 గా ఉంది. అదే 512GB స్టోరేజీ ధర రూ.1,54,900, 1TB వేరియంట్ ధర రూ.1,74,900 గా ఉంది. ఈ మోడల్‌ సిల్వర్‌, కాస్మిక్ ఆరెంజ్, డీప్‌ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

iphone 17 series

* ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,49,900 గా ఉంది. అదే 512GB స్టోరేజీ వేరియంట్‌ రూ.1,69,900, 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,89,900, 2TB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.2,29,900 గా ఉంది. ఈ మోడల్‌ సిల్వర్‌, కాస్మిక్‌ ఆరెంజ్‌, డీప్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

ఈ సంవత్సరం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఎయిర్‌ ఎయిర్‌ మోడల్‌ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉంది. అదే 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,39,900, 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,900 గా ఉంది. ఈ ఎయిర్‌ మోడల్‌ స్పేస్‌ బ్లాక్‌, క్లౌడ్‌ వైట్‌, లైట్‌ గోల్డ్‌, స్కై బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

ఆపిల్‌ స్టోర్‌లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యాక్సెక్, ICICI బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నోకాస్ట్ EMI ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
IPhone 17 series and iPhone air sale is live in india apple mumbai store video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X