Home
Mobile

ఐఫోన్‌ 17 సిరీస్‌ డమ్మీ ఫోటోలు లీక్‌.. ఈ విషయం మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది..!

ఆపిల్‌ నుంచి ఇటీవల ఐఫోన్‌ 16e మోడల్‌ లాంచ్‌ అయింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ విడుదల అయింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 17 సిరీస్‌ (iPhone 17 Series) లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. ఐఫోన్‌ 17 సిరీస్‌ నాలుగు వేరియంట్స్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్స్ లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌ డమ్మీ యూనిట్స్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్‌ సన్నీ డిక్సన్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా ఈ ఐఫోన్‌ 17 సిరీస్‌ డిజైన్, కెమెరా మాడ్యూల్‌ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌ థిక్‌నెస్‌ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది.

iPhone 17 series dummy units photos leaked

ఈ ఫోటోల ఆధారంగా ఐఫోన్‌ ప్రో మోడల్స్‌ థిక్‌నెస్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే ఎయిర్‌ మోడల్‌ అత్యంత సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 17 ఎయిర్‌ మోడల్‌ 5.5mm థిక్‌నెస్‌ ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్స్ 8.725 థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 17 మోడల్స్‌ డిజైన్‌లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది.

గతంలో వచ్చిన లీక్స్‌ ఆధారంగా ఐఫోన్‌ 17 ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లు అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు అల్యూమినియం, గ్లాస్ డిజైన్‌ తో కూడిన బ్యాక్‌ ప్యానల్స్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. వీటితోపాటు కెమెరా మాడ్యూల్‌ డిజైన్‌లోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్‌ 17 ఎయిర్‌ మోడల్‌ గూగుల్‌ పిక్సల్‌ ఫోన్‌ల తరహాలో సింగిల్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ప్రో మోడల్‌ వెనుక వైపు ఒకవైపు మూడు కెమెరాలు.. మరోవైపు LED ఫ్లాష్‌, LiDAR స్కానర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌ కలిగి ఉంటుందని తెలిసింది.

ఐఫోన్ 17 ప్రో మోడల్‌ 48MP టెలిఫోటో కెమెరాతోపాటు 24MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ టెలిఫోటో కెమెరా అడ్వాన్స్‌డ్‌ జూమింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ సామర్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో మోడల్‌ A19 ప్రో చిప్‌సెట్‌, 12GB ర్యామ్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరింత మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఐఫోన్‌ 17 సిరీస్‌ థిక్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఎయిర్‌ మోడల్‌ మాత్రమే సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే ఈ థిక్‌నెస్‌ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో ఈ మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 17 series dummy units photos leaked online here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X