iPhone 17 Series ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు. ధర వివరాలు లీక్..!
ఆపిల్ సంస్థ రేపు (సెప్టెంబర్ 9) ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series) విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. గత సిరీస్‌లో ప్లస్ వేరియంట్ విడుదల కాగా.. ఈ సంవత్సరం ఎయిర్ మోడల్ లాంచ్ చేయనుంది.
ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల గురించి ఆపిల్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అనేక రిపోర్టులు, లీక్స్ ఆధారంగా ఐఫోన్ సిరీస్ గురించి చాలా వివరాలు వెల్లడయ్యాయి. ఐఫోన్ 17 సిరీస్ రేపు 10:30 PM గంటలకు విడుదల కానుంది. ఆపిల్ పార్క్‌లో ఈ ఈవెంట్ జరగనుంది.

ఐఫోన్ 17 స్పెసిఫికేషన్‌లు :
ఈ ఫోన్ 6.3 అంగుళాల OLED ప్రో మోషన్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 120Hz డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్, Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ A19 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది.
ఈ ఫోన్ 3600mAh బ్యాటరీతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విభాగం పరంగా 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 24MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.
ఐఫోన్ 17 మోడల్ ముందు, వెనుక వైపు గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 7.8mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర $799 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.70,400) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
What to expect from the iPhone 17 lineup 🔥
— Apple Hub (@theapplehub) September 7, 2025
Apple will officially announce the new iPhones on Tuesday at the #AppleEvent pic.twitter.com/t10bPcCQl0
ఐఫోన్ 17 ఎయిర్ :
ఈ ఫోన్ ముందు, వెనుక వైపు గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు టైటానియం ఫ్రేమ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల OLED ప్రో మోషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఎయిర్ మోడల్ A19 ప్రో చిప్ తో పనిచేసే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 24MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ 2900mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది. ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ప్రారంభ ధర $1099 (భారత కరెన్సీ ప్రకారం రూ.96,800) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 17 ప్రో మోడల్స్ :
ఐఫోన్ 17 ప్రో ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాలు, ప్రో మ్యాక్స్ మోడల్స్ 6.9 అంగుళాల ప్రో మోషన్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లు Always On Display ఫీచర్‌తోపాటు యాంటీ రిఫ్లక్టివ్ కోటింగ్‌ను కలిగి ఉంటుంది.
ఈ ప్రో సిరీస్ A19 ప్రో చిప్‌సెట్‌తో కూడిన వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో మోడల్ 3700+ mAh బ్యాటరీ, అదే ప్రో మ్యాక్సో మోడల్ 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ గ్లాస్ ప్రొటెక్షన్‌తోపాటు అల్యూమినియం ఫ్రేమ్‌ను ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 48MP ప్రైమరీ కెమెరా (OIS), 48MP అల్ట్రావైడ్ లెన్స్, 8x ఆప్టికల్ జూమ్ 48MP టెలిఫోటో లెన్స్ (OIS) ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 24MP కెమెరాను అమర్చి ఉండే అవకాశం ఉంది.
ఈ కెమెరాల ద్వారా 8k వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రో మోడల్ ప్రారంభ ధర రూ.$1199 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,05,650), ప్రో మ్యాక్స్ మోడల్ ధర $1299 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.1,14,500) గా ఉంది.
images : Apple Hub


Click it and Unblock the Notifications