Home
Mobile

అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. A19 చిప్‌సెట్‌, 48MP కెమెరా..!

ఆపిల్ ఇవాళ Awe Dropping Event నిర్వహించింది. ఇందులో ఐఫోన్ 17 సిరీస్‌ ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్‌, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ ను లాంచ్ చేసింది. దీంతోపాటు వాచ్‌ 11 సిరీస్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రో 3 ను కూడా విడుదల చేసింది. ఈ కథనంలో ఐఫోన్ 17 (iPhone 17 Smartphone) గురించి తెలుసుకుందాం.

ఐఫోన్ 17 మోడల్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఐఫోన్ 17 మోడల్‌ 6.3 అంగుళాల ప్రో మోషన్‌ OLED సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సన్నని బోర్డర్‌ను కలిగి ఉంది. Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. సిరామిక్‌ షీల్డ్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

iPhone 17 Smartphone launched

A19 చిప్‌సెట్‌ :
ఈ ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్ ఆపిల్‌ కు చెందిన A19 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గత సిరీస్‌లతో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుంది. iOS 26 OS పైన పనిచేస్తుంది. మరియు neural ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 256GB స్టోరేజీ వేరియంట్‌ నుంచి అందుబాటులోకి వచ్చింది.

కెమెరా విభాగం పరంగా డ్యూయల్ ఫ్యూజన్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌), f/1.6 అపేచర్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 18MP సెంటర్‌ స్టేజ్‌ కెమెరాను అమర్చారు.

10 నిమిషాల ఛార్జింగ్‌ తో :
ఈ ఫోన్ ఫాస్ట్‌ ఛార్జింగ్ తో కూడిన బ్యాటరీని కలిగి ఉంది. ఐఫోన్ 16 తో పోలిస్తే 8 గంటలు అధికంగా బ్యాటరీ లైఫ్ రానుందని చెబుతోంది. మరియు కేవలం కొన్ని నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ పూర్తి చేస్తుందని చెబుతోంది. కేవలం 10 నిమిషాల్లోనే 8 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

యాక్షన్‌ బటన్ :
ఈ ఫోన్‌ యాక్షన్‌ బటన్‌, కెమెరా కంట్రోల్ బటన్‌ లను కలిగి ఉంటాయి. మరియు ఈ మోడల్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. లిక్విడ్‌ గ్లాస్ డిజైన్‌ ను కలిగి ఉంది. బ్లూటూత్‌ 6, వైఫై 7, eSIM సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది.

ఐఫోన్ 17 ధర, సేల్ వివరాలు :
ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.82,900 గా ఉంది. అదే 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,02,900 గా ఉంది. ఈ ఫోన్ సేల్‌ ముందస్తు ఆర్డర్‌ లు సెప్టెంబర్ 12 వ తేదీ సాయంత్రం 5:30 PM IST నుంచి ప్రారంభం కానుంది. అదే సెప్టెంబర్ 19 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Best Mobiles in India

English summary
iPhone 17 Smartphone launched with A19 chip, iOS 26 and 48MP Primary camera in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X