Home
Mobile

iPhone 17e : ఐఫోన్‌ 17e స్మార్ట్‌ఫోన్‌ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు లీక్‌..!

iPhone 17e : ఆపిల్‌ నుంచి ఈ సంవత్సరంలో తొలి ఐఫోన్‌ ఫిబ్రవరి నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 17e పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. రెగ్యూలర్‌ నంబర్‌ సిరీస్‌ మోడల్స్‌ తో పోలిస్తే ఈ ఫోన్‌లు కాస్త తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే డిజైన్‌, కెమెరాలు, ఫీచర్ల పరంగా కొన్ని మార్పులను గమనించవచ్చు.

ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? :
కొన్ని రిపోర్టుల ఆధారంగా ఐఫోన్ 17e మోడల్ భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌ లో ఫిబ్రవరి 19 న తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 18 వ తేదీన పిక్సల్‌ 10a విడుదల కానుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది.

iPhone 17e

ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ ఐఫోన్ మోడల్‌ స్లిమ్ బెజెల్స్‌, డైనమిక్‌ ఐలాండ్‌ కటౌట్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేసున్నారు. 60Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్ C1x సెల్యూలర్‌ మోడెమ్‌, N1 చిప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ ఐఫోన్ A19 చిప్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బేస్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. గ్లోబల్‌ మార్కెట్‌ లో బేస్ వేరియంట్ 256GB స్టోరేజీ, అదే భారత్‌ వేరియంట్‌ 128GB స్టోరేజీతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా గత మోడల్స్‌తో పోలిస్తే కొన్ని మార్పులను గమనించవచ్చని తెలుస్తోంది. కొన్ని లీక్స్ ఆధారంగా ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్ 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 18MP కెమెరాతో అందుబాటులోకి వస్తుందని సమాచారం.

కొత్త ఐఫోన్ మోడల్‌ iOS 19 OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ 25W Magsafe వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్‌ అమెరికా మార్కెట్‌లో $599 (భారత కరెన్సీ ప్రకారం రూ.54,300) గా ఉండే అవకాశం ఉంది.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది :
అదే భారత్‌ మార్కెట్‌లో రూ.60 వేల నుంచి 65 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత సంవత్సరం విడుదల అయిన ఐఫోన్ 16e మోడల్‌ రూ.59999 ధరకు అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రస్తుతం సుమారుగా రూ.52000 గా ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 17e విడుదల తేదీ సహా ఇతర స్పెసిఫికేషన్లపై ఆపిల్‌ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

Best Mobiles in India

English summary
iPhone 17e specifications, price tipped ahead of expected launch in February 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X