Home
Mobile

ఐఫోన్ 18 ప్రో వస్తోంది.. ఐఫోన్ 17 ప్రోని వదిలేయాలా? ఇండియన్ యూజర్ల కోసం అసలు నిజం ఇదే!

యాపిల్ మోస్ట్ ఎవైటెడ్ 'సెప్టెంబర్ 9' ఈవెంట్ బుధవారం రాత్రి 10:30 గంటలకు (IST) లైవ్ స్ట్రీమ్ కానుంది. ఈ సారి "Surprise and shine" అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ఈ మెగా ఈవెంట్ మన ముందుకు రాబోతోంది. లాంఛింగ్ సమయం దగ్గరపడటంతో.. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 17 ప్రోల మధ్య ఏది బెస్ట్ అని ఇండియన్ బైయర్లు పోల్చి చూసుకుంటున్నారు. ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే ముందే వీటి డైలీ పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, 5జీ కనెక్టివిటీతో పాటు ఇండియా ప్రైసింగ్ వివరాలను క్లియర్‌గా చూద్దాం. ఇక కొన్ని దేశాల్లో సెప్టెంబర్ 12, శనివారం నుంచే ప్రీ-ఆర్డర్లు మొదలయ్యే అవకాశముందని సమాచారం.

ప్రస్తుతం యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర ₹1,34,900గా ఉంది. దీనిపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) వెసులుబాటు ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై ₹5,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై గరిష్టంగా ₹57,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఒకేసారి చెల్లించే మొత్తంతో పాటు నెలవారీ ఈఎంఐ భారం కూడా బాగా తగ్గుతుంది. అయితే రాబోయే ఐఫోన్ 18 ప్రో ధర, ముఖ్యంగా హై-స్టోరేజ్ వేరియంట్ల ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

iPhone 18 Pro vs iPhone 17 Pro: Which One Should You Buy in 2026?

ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో: కెమెరాలు, పర్ఫార్మెన్స్

కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. ఐఫోన్ 17 ప్రోలోని A19 ప్రో చిప్‌సెట్, వేపర్ చాంబర్ హెవీ గేమింగ్ సెషన్లలోనూ ఎక్కడా ఫ్రేమ్ రేట్ తగ్గకుండా స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. దీనిలోని 48MP ప్రో ఫ్యూజన్ కెమెరాలు పగటి వెలుతురులోనే కాకుండా, నైట్ షాట్స్‌లోనూ అద్భుతమైన డీటైలింగ్‌తో కూడిన ఫొటోలను అందిస్తాయి. ఇక ఐఫోన్ 18 ప్రోలో 2nm ప్రాసెస్‌తో తయారైన A20 ప్రో చిప్‌రానుందని, ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు వేరియబుల్ అపెర్చర్ మెయిన్ కెమెరా కూడా రావచ్చు, అయితే ఇది కేవలం ప్రో మాక్స్ మోడల్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.

ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో: బ్యాటరీ, ఛార్జింగ్, 5జీ బాండ్లు

భారతీయ వినియోగదారులకు రోజువారీ వాడకంలో బ్యాటరీ లైఫ్, నెట్‌వర్క్ కనెక్టివిటీ అత్యంత కీలకం. ఐఫోన్ 17 ప్రో దాదాపు 31 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుందని యాపిల్ చెబుతోంది. 40W అడాప్టర్‌తో కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇండియా వెర్షన్లు జియో కవరేజ్‌కి, ఎయిర్‌టెల్ 5జీ రోలౌట్‌కి అనుగుణంగా n28, n78 బాండ్లను సపోర్ట్ చేస్తాయి (mmWave n258 బాండ్ ఇండియా మోడల్స్‌లో లేదు). ఐఫోన్ 18 ప్రోలో బ్యాటరీ లైఫ్ స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

అంశంఐఫోన్ 17 ప్రో (ఇండియా)ఐఫోన్ 18 ప్రో (అంచనా)
ప్రారంభ ధర₹1,34,900 నుంచిఇంకా వెల్లడికాలేదు; ధర పెరగొచ్చని అంచనా
చిప్‌సెట్A19 ప్రో; వేపర్ చాంబర్A20 ప్రో (2nm రూమర్)
ఛార్జింగ్40Wతో 20 నిమిషాల్లో ~50%దాదాపు ఇలాగే ఉండవచ్చు
5జీ సపోర్ట్n28/n78; సబ్-6 మాత్రమేపెద్దగా మార్పు ఉండకపోవచ్చు
ఓఎస్ సపోర్ట్సాధారణంగా 5–7 ఏళ్లు2026 నుంచి 5–7 ఏళ్లు

ఐఫోన్ 18 ప్రో వర్సెస్ ఐఫోన్ 17 ప్రో: ఎవరు అప్‌గ్రేడ్ అవ్వాలి?

ఇప్పటికే మీ దగ్గర ఐఫోన్ 17 ప్రో ఉందా? అయితే పెద్ద బ్యాటరీ, కొత్త కలర్స్ లేదా వేరియబుల్ అపెర్చర్ ఫీచర్ అత్యవసరం అయితే తప్ప, రివ్యూలు వచ్చే వరకు వేచి చూడటమే మంచిది. ఒకవేళ మీరు ఐఫోన్ 13, 14 లేదా 15 ఉపయోగిస్తుంటే మాత్రం.. ఐఫోన్ 17 ప్రోకి మారడం వల్ల మెరుగైన స్పీడ్, అద్భుతమైన కెమెరాలు, 'యాపిల్ ఇంటెలిజెన్స్' ఫీచర్లతో బిగ్ అప్‌గ్రేడ్ లభిస్తుంది. ఇక స్థిరమైన 5జీ, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్లను కోరుకునే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఐఫోన్ 17 ప్రో బెస్ట్ ఛాయిస్. పైగా ఈ రెండు ఫోన్‌లకు 5 నుంచి 7 ఏళ్ల పాటు ఐఓఎస్ (iOS) అప్‌డేట్స్ లభిస్తాయి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X