నాలో ఉన్నవేంటి.. నీలో లేనివేంటి..

Posted By: Staff

నాలో ఉన్నవేంటి.. నీలో లేనివేంటి..

యాపిల్ టెక్నాలజీ రంగంలో నెంబర్ వన్. కస్టమర్స్‌కు నాణ్యమైన ఉత్పత్తలు(స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ఐఫోన్స్, ఐపాడ్)అందించడంలో ఎల్లప్పుడూ ముందు ఉండే కంపెనీ. ఇటీవల యాపిల్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ 4ఎస్‌కి గతంలో విడుదల చేసిన ఐఫోన్ 4కి మద్య ఉన్న ప్రత్యేకతలను ఈరోజు వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం ప్రత్యేకంగా అందించడం జరుగుతంది.

ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్ రెండు కూడా 3.5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 960*640 ఫిక్సల్‌గా కలిగి ఉన్నాయి. ఐఫోన్ 4 స్మార్ట్ ఫోన్ 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కలిగి ఉండడమేకాకుండా 720p ఫార్మెట్ హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ దీని సొంతం. అదే ఐఫోన్ 4ఎస్ విషయానికి వస్తే 8మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కలిగి ఉండడమేకాకుండా 1080p హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు. వీటితో పాటు ఐఫోన్ 4ఎస్‌లో ఆటో ఫోకస్, విజిఎ కెమెరా అదనం.

ఐఫోన్ 4లో 1GHz ARM Cortex-A8 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయగా, ఐఫోన్ 4ఎస్‌లో డ్యూయల్ కోర్ 1GHz A5 ప్రాసెసర్‌తో పాటు డ్యూయల్ కొర్ గ్రాఫిక్స్ టెక్నాలజీని నిక్షిప్తం చేశారు. ఐఫోన్ 4 బ్లూటూత్ 2.1 కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తే, అదే ఐఫోన్ 4ఎస్ మాత్రం బ్లూటూత్ 4.0వర్సన్ ని సపోర్ట్ చేస్తుంది. మెమరీ విషయానికి వస్తే ఐఫోన్ 4 32జిబిని సపోర్టే చేయగా, ఐఫోన్ 4ఎస్ మాత్రం 64జిబిని సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్ మద్య తేడాలు క్లుప్తంగా..

ఐఫోన్ 4 ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా:
బేసిక్ మోడల్ - రూ 4,500/-
హైఎండ్ మోడల్ - రూ 13,000/-

ప్రాససెర్: 1GHz A4
మెమరీ:512MB
గ్రాఫిక్స్:PowerVR SGX 535
స్టోరేజి:16GB, 32GB
డిస్ ప్లే:3.5",640*960 Retina Display
కెమెరా:5MP
వీడియో:720p,0.3MP Front Camera
రేడియో:Quad-band GSM or CDMA
డౌన్ లోడ్ స్పీడ్:HSDPA
సిరి పర్సనల్ ఎసిస్టెంట్:No
ఇంటెలిజెంట్ స్విచ్చింగ్ ఏంటినా:No


ఐఫోన్ 4ఎస్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా:
బేసిక్ మోడల్ - రూ 8, 500/-
హైఎండ్ మోడల్ - రూ 17, 000/-

ప్రాససెర్: A5 Dual-Core
మెమరీ:1GB
గ్రాఫిక్స్:PowerVR SGX 543MP2(7x iphone 4)
స్టోరేజి:16GB, 32GB, 64GB
డిస్ ప్లే:3.5",640*960 Retina Display
కెమెరా:8MP
వీడియో:1080p,0.3MP Front Camera
రేడియో:GSM+CDMA
డౌన్ లోడ్ స్పీడ్:HSDPA(14.4Mbps down)
సిరి పర్సనల్ ఎసిస్టెంట్:Yes
ఇంటెలిజెంట్ స్విచ్చింగ్ ఏంటినా:Yes

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot