యాపిల్ ఎక్స్చేంజ్ ఆఫర్... ‘మీ పాత ఫోన్ తీసుకురండి 7,000 తగ్గింపుతో ఐఫోన్4 తీసుకెళ్లండి!
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇండియా వంటి ప్రముఖ మార్కెట్‌లలో తన అమ్మకాలను మరింత పెంచుకునే క్రమంలో యాపిల్.. ఐఫోన్ 4ఎస్ ఇంకా ఐఫోన్4 కొనుగోళ్లకు సంబంధించి సరికొత్త ఎక్స్చేంజ్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు వాడకంలో ఉన్న తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉన్న షోరూమ్ వద్దకు తీసుకెళ్లినట్లయితే ఫోన్ మన్నికను బట్టి వెల కట్టడం జరగుతుంది. హ్యాండ్‌సెట్ పనితీరును బట్టి రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఎక్స్చేంజ్ ధరను ఆశించవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ఫోన్ పై వచ్చిన మొత్తాన్ని ఐఫోన్4 లేదా ఐఫోన్4ఎస్ అసలు ధరలో మినహాయిస్తారు. ప్రస్తుత మార్కెట్లో ఐఫోన్4 ఇంకా 4ఎస్‌లు రూ.26,500 ప్రారంభ ధర నుంచి లభిస్తున్నాయి. ఈ రోజే మీ సమీపంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌ను సంప్రదించి ఈ ఎక్సేంజ్ ఆఫర్ పై యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేయండి.
నిబంధనలు:
- అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లకు మాత్రమే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో అర్హత ఉంటుంది.
- ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలనుకుంటున్న స్మార్ట్‌ఫోన్ ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పాతదై ఉండాలి.
- అదేవిధంగా బిల్ రిసిఫ్ట్ ఇంకా సదరు మొబైల్‌కు సంబంధించిన బాక్స్‌ను సంబంధిత ప్రతినిధికి సమర్పించాల్సి ఉంటుంది.
- ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను యాపిల్ ఐస్టోర్, క్రోమా తదితర ప్రముఖ రిటైల్ స్టోర్‌ల వద్ద పొందవచ్చు.


Click it and Unblock the Notifications