పుకార్లను బలపరుస్తున్న వీడియో టేప్?

Posted By: Prashanth

పుకార్లను బలపరుస్తున్న వీడియో టేప్?

 

అనేకు పుకార్ల అనంతరం ఆపిల్ ఐఫోన్ 5 ఆవిష్కరణకు నోచుకోనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యెర్బా బ్యునా సెంటర్ ఆర్ట్స్ థియేటర్ వేదికగా సెప్టంబర్ 12న ఐఫోన్ 5ను ప్రదర్శంచేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువురికి ఆహ్వాన పత్రాలు అందాయి. ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ఐఫోన్5 డిజైనింగ్ అదేవిధంగా పీచర్లకు సంబంధించి అనేకమైన వదంతలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేసాయి. వీటన్నింటికి సెప్టంబర్ 12తో తెరపడనుంది. ఐఫోన్ 4ఎస్‌కు తరువాతి వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్ 5 పెద్దదైన డిస్‌ప్లేతో పాటు 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Read In English

ఐఫోన్ 5 కాన్సెప్ట్ వీడియోను ఇక్కడ చూడొచ్చు:

ఐఫోన్5‌‍కు సంబంధించి అనధికారికంగా వ్యాపించిన స్పెసిఫికేషన్‌లు:

పెద్దదైన స్ర్కీన్,

చిన్నదైన డాక్ కనెక్టర్,

ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం,

సిరి వాయిస్ కమాండ్ అప్లికేషన్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1జీబి ర్యామ్,

లిక్విడ్ మెటల్ ఫేసింగ్,

మన్నికైన బ్యాటరీ.

తాజాగా బెర్లిన్‌లో నిర్విహించిన ఐఎఫ్ఏ 2012 గ్యాడ్జెట్ ఎగ్జిబిషన్‌లో జర్మనీకి చెందిన ప్రముఖ వెబ్‌సైట్ GSMIsrael, ఐఫోన్‌5‌కు సంబంధించి మాకప్(mockup)ను విడుదల చేసింది. ఆ వివరాలను వీడియో రూపంలో మీరు చూడండి

వీడియో యూఆర్ఎల్:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting