అక్టోబర్ 19 నుంచి ఐఫోన్5 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం?

Posted By: Staff

అక్టోబర్ 19 నుంచి ఐఫోన్5 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం?

 

ఆపిల్ ఐఫోన్5ను సొంతం చేసుకోవాలని యమా కుతూహలంగా ఉన్న భారతీయులకు గుడ్ న్యూస్. ఐఫోన్5 అమ్మకాలు దేశీయంగా అక్టోబర్ 26 నుంచి అధికారికంగా ప్రారంభమవుతున్న నేపధ్యంలో, అక్టోబర్ 19 నుంచి ముందుస్తు బుకింగ్ లను ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రీ-ఆర్డర్‌లను ఆపిల్ అధికారిక పునఃవిక్రేతలు(రీసెల్లర్స్) ప్రారంభించనున్నట్లు సమాచారం. ధర అంచనా ఐఫోన్ 5 (16జీబి వర్షన్) రూ.45,000, 32జీబి వర్షన్ రూ.50,000, 64జీబి వర్షన్ ధర తెలియాల్సి ఉంది.

ఆఫిల్ ఐఫోన్5 ఫీచర్లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).

ఇతర ఫీచర్లు:

నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,

సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,

ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,

టీవీ అవుట్,

ఐమ్యాప్స్,

ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ఇమేజ్ ఎడిటర్,

వాయిస్ మెమో.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting