అక్టోబర్ 30కల్లా ఇండియాలో ఐఫోన్5?

రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్ ఫోన్ ‘ఐఫోన్-5’ అక్టోబర్ 30 నాటికి దేశీయ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. అప్పటి వరకు ఓపిక పట్టలేని ఆపిల్ అభిమానులు అధిక ధరను చెల్లించి గ్రే మార్కెట్లో ఐఫోన్-5ను దక్కించుకోవచ్చు. మార్కెట్లో సెప్టెంబర్ 23-26 తేదీల మధ్య 64 జీబీ ఫోన్ ఖరీదు రూ.1.2 లక్షల వరకు పలికినట్లు సమాచారం. కస్టమర్‌ను బట్టి ప్రస్తుతం రూ.70-90 వేల మధ్య విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. 16, 32, 64 జీబీ వేరియంట్లలో యాపిల్ ఐఫోన్-5 లభిస్తోంది. యాపిల్ ఫోన్లకు డిమాండ్ ఉన్న నగరాల్లో హైదరాబాద్ కూడా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఐఫోన్-5 ఇక్కడి అభిమానుల చేతుల్లోకి వచ్చి చేరింది. హైదరాబాద్‌లోనూ ఒక్కో ఫోన్ రూ.1 లక్ష వరకు పలికిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కనీసం 500కు పైగా ఫోన్‌లను కస్టమర్లు చేజిక్కించుకున్నట్టు సమాచారం.
ఆఫిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:
4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,
సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,
ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,
ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,
టీవీ అవుట్,
ఐమ్యాప్స్,
ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఇమేజ్ ఎడిటర్,
వాయిస్ మెమో.


Click it and Unblock the Notifications








