ఐఫోన్5 అమ్మకాలపై దిమ్మతిరిగే అంచనాలు!

సెప్టంబర్ 21న విడుదల కాబోతున్న ఆపిల్ ఐఫోన్ 5 అమ్మకాల పై దిమ్మతిరిగే అంచనాలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంకా ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానప్పటికి గత రికార్డులు ఆధారంగా ఐఫోన్5 అమ్మకాలను అంచనావేస్తున్నారు. ఐఫోన్ 5 మొదటి నెలలో కోటి యూనిట్లు అమ్ముడుపోవడం ఖాయమని ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఆర్‌బీసీ క్యాపిటల్ మార్కెట్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ నెలాఖరు నాటికి ఐఫోన్5 ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో లభ్యం కానుంది. ఐఫోన్5కు మునుపటి వర్షన్ అయిన ఐఫోన్ 4ఎస్ విడుదలైన వారం రోజల్లో 7 మార్కెట్లకు గాను 4 మిలియన్ అమ్మకాల మార్క్‌ను నమోదు చేసిందని ఆర్‌బీసీ క్యాపిటల్ మార్కెట్ ఈ సందర్భంగా గుర్తుచేసింది.
ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ఆపిల్ ఐఫోన్ పాత వర్షన్‌లైన ఐఫోన్4 ఇంకా ఐఫోన్ 4ఎస్‌లు అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి గాను 26 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నాటికి 100 దేశాల్లో ఐఫోన్ 5 లభ్యంకానుండటంతో అమ్మకాలు మరింత ఆశాజనకంగా ఉండొచ్చని ఆపిల్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Read In English
ఆఫిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:
4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,
సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,
ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,
ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,
టీవీ అవుట్,
ఐమ్యాప్స్,
ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఇమేజ్ ఎడిటర్,
వాయిస్ మెమో.
ధరలు: 16జీబి వర్షన్ ధర రూ.11,000. 32జీబి వర్షన్ ధర రూ.16,500, 32 జీబి వర్షన్ ధర రూ.22,000.


Click it and Unblock the Notifications