Home
Mobile

50 దేశాల్లో ఐఫోన్5!

By Super
iPhone 5 Slated to Land in More Than 50 Countries in December Ahead of Holiday Season


డిసెంబర్ ఇంకా హాలిడే సీజన్‌ను పురస్కరించుకుని 50 దేశాల్లో ఐఫోన్5ను విడుదల చేస్తున్నట్లు ఆపిల్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 7 (శుక్రవారం) నుంచి సౌత్ కొరియాలో ఐఫోన్ 5 విక్రయాలు ప్రారంభంకానున్నాయి. తరువాతి క్రమంలో బ్రెజిల్, రష్యా, తైవాన్ సహా 50 దేశాల్లో కొత్త తరం ఐఫోన్ విడుదలకానుంది. డిసెంబర్ 17 నుంచి చైనా మార్కెట్లో లభ్యమవుతుంది. ఇప్పటికే యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, జపాన్, యూకే సహా 47 దేశాల్లో ఐఫోన్ 5 లభ్యమవుతోంది. ఇండియాలో ఐఫోన్5 బ్లాక్ ఇంకా స్లేట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ధరలు 16జీబి - రూ.45,500, 32జీబి - రూ.52,500, 64జీబి - 59,500.

ఐఫోన్‌5 స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).

ఇతర ఫీచర్లు:

నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,

సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,

ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,

టీవీ అవుట్,

ఐమ్యాప్స్,

ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ఇమేజ్ ఎడిటర్,

వాయిస్ మెమో.

Read in English

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X