ఐఫోన్ 5 ఫీచర్స్ మార్కెట్లోకి వచ్చేశాయ్..

Posted By: Staff

ఐఫోన్ 5 ఫీచర్స్ మార్కెట్లోకి వచ్చేశాయ్..

స్మార్ట్ ఫోన్లకు ధీటుగా పోటీపడగల సత్తా కేవలం ఒక్క ఐఫోన్ లకు మాత్రమే ఉంది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఐఫోన్‌ని ఒక్కసారి అన్నా కోనుగోలు చేయాలనేది మొబైల్ యూజర్ల కోరిక. ఇప్పటికీ ఐపోన్ అంటే చాలా మంది మొబైల్ యాజర్లకు ప్రత్యేకమైనటువంటి మోజు. అందుకు కారణం ఐఫోన్ చూడడానికి చాలా స్టయిల్‌గా ఉండడమే కాకుండా అందులో అదిరేటి ఫీచర్స్ ఉండడమే. ఐఫోన్‌లను తయూరు చేసేటటువంటి ఆపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 4ని విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉండగా త్వరలో విడుదల అవుతున్నటువంటి మరో కొత్త ఉత్పత్తి ఐపోన్ 5 గురించిన సమాచారం మీకోసం ప్రత్యేకం...

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటేషన్‌ని దృష్టిలో పెట్టుకోని ప్రతి ఒక్క మొబైల్ తయారీదారు కూడా వినూత్న పద్దతులను అవలంభిస్తున్నారు. అందులో భాగంగానే ఆపిల్ కంపెనీ కూడా త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 5లో సరిక్రొత్త ఐవోఎస్ అప్ టేడ్ వర్సన్స్‌ని ఉపయోగించనున్నారు. ఐఫోన్ 5కి సంబంధించిన పిక్చర్స్ కొన్ని చైనా మొబైల్ మార్కెట్లో సంచరిస్తున్నాయి. దీంతో చాలా టెక్నాలజీ బ్లాగులు ఇదంతా నిజమేనని తేల్చేశాయి. అంతేకాకుండా సెప్టంబర్ 2011లో ఆపిల్ తన ఐఫోన్ 5ని విడుదల చేయబోతుందని కూడా స్పష్టం చేశాయి.

చైనా మొబైల్ ద్వారా ఆపిల్ కంపెనీ ఐఫోన్ 5ని చైనా మొబైల్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మొబైల్ క్యారియర్లలలో కెల్లా చైనా మొబైల్ అతి పెద్దది. ఈ విషయాన్ని ఆపిల్ కంపెనీ సివోవో టిమ్ కూక్ చైనా మొబైల్ కార్పోరేట్ ఆఫీస్‌లో పోయిన నెలలో స్పష్టం చేశారు. ఇక ఐఫోన్ 5 ఫీచర్స్ విషయానికి వస్తే ఐపోన్ 4 మాదిరే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్ 4తో పోల్చినట్లైతే ఐపోన్ 5 చాలా స్లిమ్‌గా కొంచెం బరువు తగ్గవచ్చునని అంటున్నారు. సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదల కానున్న ఐఫోన్ 5 స్పెషల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం...

i-Phone 5 Features:

A5 processor with processor speeds in the range of 1.2 to 1.5 GHz
Aluminium coated rear cladding
Teardrop Design adapted from the i-Pod Touch
More powerful antenna
1GB of RAM
8 Mega Pixel Camera with 1080p video recording
Wireless Charging
4 inch display screen
iOS 5 operating platform
4G connectivity
Motion Sensitive gaming with powerful graphics processor
Better battery backup

ఐపోన్ 5 ధరను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. దాదాపు ఐఫోన్ 4 మాదరే ఉన్నప్పటికీ ధర కొంచెం ఎక్కవగా ఉండవచ్చునని నిపుణుల అభిప్రాయం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot