ఐఫోన్ 5 X గెలాక్సీ ప్రీమియర్!

Posted By: Super

ఐఫోన్ 5  X గెలాక్సీ ప్రీమియర్!

 

దేశీయంగా ఆపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రాను వచ్చింది. దేశవ్యాప్తంగా నేటి నుంచి ఐఫోన్5 విక్రయాలు అధికారికంగా మొదలుకానున్నాయి. మరో వైపు ఐఫోన్5కు పోటీగా సౌత్‌కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్  గెలాక్సీ ప్రీమియర్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. గెలాక్సీ నెక్సస్ అలాగే గెలాక్సీ ఎస్3 సమ్మేళనంగా  రూపుదిద్దుకున్న  గెలాక్సీ ప్రీమియర్ నవంబర్ చివరా లేదా డిసెంబర్ ప్రారంభం నాటికి భారత్ మార్కెట్లో లభ్యంకానుంది. ఈ నేపధ్యంలో రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా........

బరువు ఇంకా చుట్టుకొలత...

ఐఫోన్ 5: చుట్టుకొలత  123.8 x 58.6 x 7.6మిల్లీ మీటర్లు, బరువు 112 గ్రాములు,

గెలాక్పీ ప్రీమియర్:  శరీర చుట్టుకొలత 134.2 x 68 x 8.99మిల్లీ మీటర్లు, బరువు 130 గ్రాములు,

డిస్‌ప్లే...

ఐఫోన్5: 4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్,

గెలాక్పీ ప్రీమియర్: 4.65 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ పెన్‌టైల్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ఆపరేటింగ్ సిస్టం...

ఐఫోన్5:  ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: లేటెస్ట్ వర్షన్ ఆపిల్ మొబైల్  ఆపరేటింగ్ సిస్టం, 200 సరికొత్త ఫీచర్లు,  ఆపిల్ మ్యాప్స్, మెరుగైన సిరీ వ్యవస్థ, సరికొత్త సఫారీ బ్రౌజర్, ఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, ఫేస్‌బుక్‌తో లోతైన అనుసంధానం, సరికొత్త పాస్‌బుక్ అప్లికేషన్, ఫోటో స్ట్రీమ్ అప్లికేషన్)

గెలాక్పీ ప్రీమియర్:  ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు:  ప్రాజెక్ట్ బట్టర్,  కాంట్రాక్టిబుల్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, టాస్క్ నేవిగేషన్,  లైవ్ వాల్ పేపర్ ప్రివ్యూ, హై రిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్).

కెమెరా....

ఐఫోన్5:  8మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

గెలాక్పీ ప్రీమియర్: ప్రత్యేకతమైన ఐసైట్ వ్యవస్థతో కూడిన 8 మెగా పిక్పల్ రేర్ కెమెరా(బ్యాక్‌సైడ్ ఇల్యూమినేషన్,  హెచ్‌డిఆర్,  పానోరమా సపోర్ట్,  వేగవంతమైన ఆపర్చర్ స్పీడ్), 1.3 మెగా పిక్సల్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

మెమరీ....

ఐఫోన్5: మెమెరీ కాన్ఫిగరేషన్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 1జీబి ర్యామ్,

గెలాక్పీ ప్రీమియర్:  మెమరీ కాన్ఫిగరేషన్స్ (8జీబి, 16జీబి), 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 64జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమరీ,

కనెక్టువిటీ....

ఐఫోన్5: 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, హెచ్‌ఎస్‌డీపీఏ 21ఎంబీపీఎస్, హెచ్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0.

గెలాక్పీ ప్రీమియర్:  నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,  హెచ్‌ఎస్‌డీపీఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ....

ఐఫోన్5: లియోన్ బ్యాటరీ (225 గంటల స్టాండ్‌బై, 8 గంటల టాక్‌టైమ్),

గెలాక్పీ ప్రీమియర్: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.....

ఐఫోన్5: 16జీబి వేరియంట్ ప్రీఆర్డర్ ధర రూ.45,500,

గెలాక్పీ ప్రీమియర్:  గెలాక్సీ ప్రీమియర్ ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రత్యేకతలు:

ఐఫోన్5: ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఉన్నత విలువలతో కూడిన సిరీ వాయిస్  రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, లోతైన ఫేస్‌బుక్ అనుసంధానం.

గెలాక్పీ ప్రీమియర్:  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ, ఎస్ బీమ్, స్మార్ట్ స్టే, డైరెక్ట్ కాల్, పాప్-అప్‌ప్లే, ఎస్ వాయిస్, బెస్ట్ ఫోటో.

తీర్పు:

మెమరీ విషయాన్నిపక్కనపెట్టి తక్కువ బరువు అలాగే ఉత్తమ క్వాలిటీ కెమెరాను కోరుకునే వారికి ఐఫోన్5 ఉత్తమ ఎంపిక. మరో వైపు.. పెద్ద స్ర్కీన్ సైజ్, ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ ఆప్షన్స్, నియర్ ఫీల్డ్ కనెక్టువిటీ వంటి ప్రత్యేక ఫీచర్లను కోరుకునే వారికి గెలాక్సీ ప్రీమియర్ బెస్ట్ చాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot