ఈ ఐఫోన్5 ధర 86కోట్లు..!

|

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ ధర రూ.45,000 ఉంటే వీళ్లేంటి 86 కోట్లంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా..?. బడాబాబుల కోసం నిలువెత్తు వజ్రాలు ఇంకా బంగారంతో కూడిన ఐఫోన్5ను ఓ డిజైనర్ రూపొందించారు. విలువైన వజ్రాలను పొదగి బంగారు వర్ణంతో దగదగ మెరుస్తూ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఐఫోన్5ను యూకేకు చెందిన ప్రముఖ డిజైనర్ స్టువర్ట్ హ్యూగ్స్ డిజైన్ చేసారు. ధర $15.3మిలియన్లు ఇండియన్ మార్కెట్లో ఈ విలువ రూ.84కోట్లన్నమాట. స్టువర్ట్ ఇంతకముందు ఐఫోన్4, మ్యాక్ బుక్ ఇంకా ఐప్యాడ్ 2లకు తన కళాచతురతను ఉపయోగించి బంగారు పూతతో పాటు వజ్రాలను అద్దారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన హ్యాండ్‌సెట్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ 24- క్యారట్ గోల్డ్ ఐఫోన్5ను డిజైన్ చేయటానికి స్టువర్ట్ 9 వారాల పాట శ్రమించారట.

 

ఐఫోన్5 స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల ఐపీఎస్ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1136 X 640పిక్సల్స్), ఏ6ఎక్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3జీ ఇంకా 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి,32జీబి,64జీబి, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1440ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, ధర రూ.45,500(16జీబి).

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X