Home
Mobile

ఐఫోన్ 5సీ ధర తగ్గింపు..?

టెక్నాలజీ టైటాన్ యాపిల్ నుంచి భారీ అంచనాలలతో గతేడాది విడుదలైన ‘ఐఫోన్ 5సీ' ఆశించిన స్థాయిలో అమ్మకాలను అధిరోహించలేకపోయింది. ఐఫోన్ 5సీ అమ్మకాలకు సంబంధించి మార్కెట్లో నమోదైన నిరాశాజనకమైన ఫలితాల నేపధ్యంలో ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో ఫోన్ ధరను తగ్గించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించి యాపిల్ నుంచి ఏవిధమైన ధృవీకరణా లేదు.

ఐఫోన్ 5సీ ధర తగ్గింపు..?

అయితే, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Amazon.in ఐఫోన్ 5సీ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపు పై రూ.36,899కి ఆఫర్ చేస్తోంది. 32జీబి వర్షన్ పై ఏ విధమైన రాయితీ ఆఫర్లు లేవు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్‌‍‌ను అమలులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 5సీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను యాపిల్, 2013 నవంబర్‌లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.41,990.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X