Home
Mobile

గ్రేమార్కెట్లోకి ‘ఐఫోన్ 5ఎస్’.. ధర లక్ష పైనే ?

యాపిల్ కొత్త వర్షన్ ఫోన్‌లైన ‘ఐఫోన్ 5ఎస్' ఇంకా ‘ఐఫోన్ 5సీ'లు ఇండియన్ మార్కెట్లో ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికి వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని దేశంలోని గ్రే మార్కెట్లు కల్పిస్తున్నాయి. అయితే, గ్రే మార్కెట్ల ద్వారా యాపిల్ కొత్త ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంది.

గ్రేమార్కెట్లోకి  ‘ఐఫోన్ 5ఎస్’.. ధర లక్ష పైనే ?

ఇండియన్ గ్రే మార్కెట్‌లో ఐఫోన్ 5ఎస్ బేసిక్ మోడల్‌ను ప్రాంతాన్ని బట్టి రూ.65,000 నుంచి రూ. 1,00,000 ధరల మధ్య విక్రియిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 5సీ మోడల్‌కు ఇండియన్ మార్కెట్లో డిమాండ్ కాస్త తక్కువుగానే ఉన్నప్పటికి ఈబే ( eBay) వంటి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఇంచుమించుగా రూ.55,000 ధరకు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రే మార్కెట్లలో లభ్యమవుతున్న యాపిల్ డివైజ్‌లు ఫ్యాక్టరీ అన్‌లాకుడ్ వర్షన్‌లు కావటంతో ఎటువంటి వారంటీలు వర్తించవు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అమెరికా, చైనా ఇంకా యూరోప్ మార్కెట్లలో యాపిల్ కొత్త ఐఫోన్‌ల విక్రయాలు గత శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి. అమెరికన్ మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ 16జీబి అన్‌లాకుడ్ వర్షన్ ధర 649 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా రూ.40,000). ఐఫోన్ 5సీ ధర 549 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ ఇంచుమించుగా రూ.34,000).

ఢిల్లీ ఇంకా ముంబై నగరాల్లో ఉన్న ప్రధాన గ్రే మార్కెట్‌లలో ఐఫోన్ 5ఎస్ లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గోల్డ్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతున్న ఐఫోన్ 5ఎస్ పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పాట్నాకు చెంది ఓ వ్యక్తి ఐఫోన్ 5ఎస్ 16జీబి గోల్డ్ కలర్ వర్షన్‌ను రూ.1,08,000 చెల్లించి ప్రముఖ రిటైలర్ ఈబే ( eBay) వద్ద కొనుగోలు చేసినట్లు ఢిల్లీ డీలర్ ఒకరు పేర్కొన్నారు. ఇండియన్ గ్రే మార్కెట్లో, ఐఫోన్ 5ఎస్ 64జీబి గోల్డ్ కలర్ వర్షన్ ధర రూ.1,70,000గా ఉన్నట్లు అంచనా.

ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్ లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X