దూసుకెళ్తున్న ఐఫోన్ 5ఎస్: 24 గంటల్లోనే సరుకు ఖాళీ!!

|

ఏటా దీపావళి వచ్చిందంటే.. బంగారం ఇంకా వెండి ఆభరణాలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం ఇండియన్ మార్కెట్ భిన్నమైన వాతావరణాన్ని చవి చూసింది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఇండియన్ మార్కెట్లో యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కోసం జనం క్యూ కట్టారు. దీంతో యాపిల్ కొత్త ఐఫోన్‌ల విక్రయాలు ఉత్తేజకరంగా ప్రారంభమయ్యాయి.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్, బెంగుళూరు, ఆహ్మదాబాద్, ఢిల్లీ, లుడియానా, ముంబయ్, పూణే, చెన్నై, గుర్గావ్, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ ఇండియా తన కొత్త‌వర్షన్ ఐఫోన్5ఎస్, ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 5సీ (16జీబి) వర్షన్ రూ.41,000, 32జీబి వర్షన్ ధర రూ.53,500. ఐఫోన్5ఎస్ (16జీబి) వర్షన్ ధర రూ.53,500, 32 జీబి వర్షన్ ధర రూ.63,500, 64జీబి వర్షన్ ధర రూ.71,500.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

24 గంటల్లోనే సరుకు ఖాళీ:

భారత రిటైల్ మార్కెట్లో విడుదలైన 24 గంటల వ్యవధిలోనే ‘ఐఫోన్ 5ఎస్' స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా అమ్ముడుపోయాయి. యాపిల్ ఐఫోన్‌లు ఇలా అమ్ముడవటం ఇదే మొదటి సారి. ఐఫోన్ 5ఎస్ స్టాక్ పూర్తిగా అయిపోవటంతో శనివారం సాయంత్రం నుంచి ఐఫోన్ 5సీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆవిష్కరణ దశలో భాగంగా యాపిల్ 30,000 ఐఫోన్ 5ఎస్ ఇంకా 5సీ యూనిట్‌లను పంపిణీ చేసినట్లు సమాచారం. ఐఫోన్ 5ఎస్ కొత్తస్టాక్ బుధవారం నుంటి లభ్యమవుంతదని రిటైల్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0. ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

ఐఫోన్ 5సీ భారత మార్కెట్లో 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

దూసుకెళ్తున్న ఐఫోన్ 5ఎస్: 24 గంటల్లోనే సరుకు ఖాళీ!!

దూసుకెళ్తున్న ఐఫోన్ 5ఎస్: 24 గంటల్లోనే సరుకు ఖాళీ!!

దూసుకెళ్తున్న ఐఫోన్ 5ఎస్: 24 గంటల్లోనే సరుకు ఖాళీ!!

యాపిల్ కొత్త  ఐఫోన్‌ల కోసం క్యూ కట్టిన జనం

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X