ఐఫోన్ 6... 10 బెస్ట్ ఫీచర్లు

Posted By:

అభిమానుల అంచనాలను నిజం చేస్తూ యాపిల్ ఐఫోన్ 6 వచ్చేసింది. మంగళవారం కాలిఫోర్నియాలోని క్యుపెర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను సగర్వంగా ప్రకటించారు. 4.7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్ ఐఫోన్ 6 గాను, 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్ ఐఫోన్ 6ప్లస్ గాను మార్కెట్లో లభ్యమవుతాయి. ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలను అక్టోబర్ 17 నుంచి ప్రారంభించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. యూఎస్ మార్కెట్లో ఐఫోన్ 6 విక్రయాలు సెప్టంబర్ 19 నుంచి ప్రారంభవుతున్న విషయం తెలిసిందే.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఐఫోన్ 6 స్పెసిఫికేషన్‌‍లు:

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ 6 శక్తివంతమైన హైడెఫినిషన్ రిటీనా స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. స్వల్ప ప్రమాదాలకు ఐఫోన్6 తట్టకుని పనిచేయగలదు.

 

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

కేవలం 6.9 మిల్లీమీటర్ల మందంతో ఐఫోన్ 6 అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కర్వుడ్ అంచులు, మెటల్ బాడీ డిజైనింగ్ ఆకట్టకుంటుంది.

 

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

పూర్తిగా అప్‌డేట్ కాబడిన సరికొత్త ఐఓఎస్ 8 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై ఐఫోన్ 6 రన్ అవుతుంది.

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ కెమెరా ప్రత్యేకమైన ‘ యాపిల్ ఐసైట్ సెన్సార్' టెక్నాలజీ పై స్పందిస్తుంది. ఈ కెమెరా పోటోలను వాస్తవ అనుభూతులతో మరింత క్వాలిటీగా అందిస్తుంది.

 

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఏ8 చిప్ సెట్‌ను ఐఫోన్ 6లో వినియోగించారు. పాత వర్షన్ ఐఫోన్‌లలోని ప్రాసెసర్‌లతో పోలిస్తే ఏ8 చిప్ ప్రాసెసింగ్ పవర్ 50 రెట్లు వేగంగా ఉంటుంది, గ్రాఫిక్స్ వేగం కూడా 50 రెట్లు పెరుగుతుంది.

 

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ 6 కోసం 13 లక్షల అప్లికేషన్‌లను సిద్థంగా ఉంచినట్లు యాపిల్ తెలిపింది.

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ 6లో ఏర్పాటు చేసిన సరికొత్త వై-ఫై టెక్నాలజీ ఐఫోన్ 5ఎస్‌తో ఏర్పాటు చేసిన వై-ఫై వ్యవస్థతో పోలిస్తే 3 రెట్లు వేగంగా స్పందిస్తుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ ఆకట్టుకుంటుంది.

 

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

టచ్ ఐడీ పేరుతో ప్రత్యేకమైన సెక్యూరిటీ పీచర్‌ను యాపిల్ ఐఫోన్ 6లో ఏర్పాటు చేసింది. ఈ ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫీచర్ ఫోన్ భద్రతను మరింత పటిష్టం చేస్తుంది.

 

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ 6 ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. తద్వారా 4జీ సాధ్యమవుతుంది.

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఆరోగ్య సంబంధిత అప్లికేషన్‌లతో పాటు వ్యాయమ సంబంధింత ఫిట్నెస్ అప్లికేషన్‌లను ఐఫోన్ 6లో నిక్షిప్తం చేసారు. ఈ యాప్‌ల ద్వారా వినియోగదారుదు తన ఫిట్నెస్ ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iphone 6 Launched Know About 10 Best Features. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot