అంతుచిక్కని ఐఫోన్ 7ఎస్, ఐఫోన్‌8 ఫీచర్లు..

Written By:

త్వరలో ఆపిల్‌ అభిమానులను పలకరించనున్న ఐఫోన్‌ 7ఎస్, 7ఎస్‌ ప్లస్‌తోపాటు ఐఫోన్‌8 మోడళ్లలో వినూత్న ఫీచర్లు దర్శనమివ్వనున్నాయి. వీటికి సంబంధించి ఇవే ఫొటోలు అంటూ ఆన్‌లైన్‌లో కొన్ని దర్శనమిస్తున్నాయి. ఫోన్ల వెనుక భాగం గ్లాస్‌తోపాటు వీటిలో వైర్‌లెస్‌ చార్జింగ్‌ ఫీచర్‌ కూడా ఉండనుందని తెలుస్తోంది.

కొత్త ఐఫోన్ 8 ఇదిగో, ఇలా ఉంటుందట..

అంతుచిక్కని ఐఫోన్ 7ఎస్, ఐఫోన్‌8 ఫీచర్లు..

ఈ 3 మోడళ్లను ఆపిల్‌ వచ్చే నెలలో విడుదల చేయనుందన్న వార్తలు రాగా, 2018 ప్రారంభం వరకు రాకపోవచ్చన్న విరుద్ధ వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ వీటి విడుదలకు సంబంధించి సెప్టెంబర్‌ నాటికి స్పష్టత వస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న ఐఫోన్ 8 ఈ ఫీచర్లు ఈ విధంగా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఆపిల్ ఫోనేనా..? మతిపోగొడుతున్న ఐఫోన్ 8 ఎడ్జ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెజెల్ లెస్ డిస్‌ప్లేలు

శాంసంగ్ ఇటీవలే విడుదల చేసిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లలో ఉన్న డిస్‌ప్లేల తరహాలోనే ఆపిల్ కూడా తన కొత్త ఐఫోన్ మోడల్స్‌లో బెజెల్ లెస్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తున్నట్టు మింగ్ చి-కువో గ్రూప్ వెల్లడించింది. దీంతో ఫోన్ డిస్‌ప్లే బాడీ కన్నా గరిష్ట భాగాన్ని ఆక్రమిస్తుంది. డిస్‌ప్లే సైజ్‌లు 4.7, 5.2, 5.5, 5.8 లలో కొత్త ఐఫోన్ మోడల్స్ రావచ్చని తెలిపింది.

ఎంబెడ్డెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఇప్పటి వరకు వచ్చిన పలు ఐఫోన్ మోడల్స్‌లో టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను హోమ్ బటన్ కిందే అమర్చారు. అయితే ఇకపై రానున్న ఐఫోన్‌లలో డిస్‌ప్లే కిందే ఎంబెడ్డెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చవచ్చని తెలిసింది.

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ

కళ్లతోనే ఫోన్ అన్‌లాక్ చేయడం, కళ్ల గెస్చర్స్‌తో అప్లికేషన్లను ఓపెన్, క్లోజ్ చేయడం వంటి పనులు చేసుకునే విధంగా నూతన ఐఫోన్‌లలో కొత్తగా 3డీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఆపిల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

ఐఫోన్ 32 జీబీకి సెలవు

కొత్తగా రానున్న ఐఫోన్ మోడల్స్ ఇక 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లలో విడుదల కావు. కేవలం 64, 128, 256 జీబీ మోడల్స్‌లోనే కొత్త ఐఫోన్లు వచ్చేందుకు అవకాశం ఉందట.

యూఎస్‌బీ టైప్ సి

 ఇప్పటికే చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టును అందిస్తున్నారు. దీంతో చార్జింగ్ వేగంగా అవడమే కాదు, డేటా కూడా వేగంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ క్రమంలోనే కొత్తగా రానున్న ఐఫోన్స్‌లో యూఎస్‌బీ టైప్ సి పోర్టును అందించనున్నట్టు మింగ్ చి-కువో గ్రూప్ వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 7S dummy model points to a glass back and wireless charging Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting