చరిత్రలో తొలిసారి, 512జిబితో ఐఫోన్ 8..
ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఈవెంట్‍ను నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఈవెంట్‍ను నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్ ఆపిల్ ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయకుండా చాలా నిశ్శబ్దంగా ఉంది. టెక్ వర్గాలు మాత్రం ఆపిల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని, సెప్టెంబర్ తొలి లేదా రెండో వారంలో నిర్వహించబోయే ఈవెంట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 8ను లాంచ్‌చేస్తుందని ఇప్పటికే అంచనాకు వచ్చాయి.

ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్
ఈ ఈవెంట్ లో ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్లు కూడా ఐఫోన్ అభిమానుల ముందుకు వస్తాయని పేర్కొంటున్నాయి.

ఐఫోన్ 8పై వస్తున్న అంచనాలు
అయితే ఐఫోన్ 8పై వస్తున్న అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తాజాగా విడుదలైన లీకేజీలో ఐఫోన్ 8 గురించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్ 12న లాంచ్
ఈ ఓలెడ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 12న లాంచ్ చేస్తారని, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇది మార్కెట్లలోకి వస్తుందని తెలుస్తోంది.ఈ మేరకు మ్యాక్4ఎవర్ రిపోర్టు చెప్పింది. అదేవారంలో మూడు ఫోన్లు ప్రీ-ఆర్డర్లకు వస్తాయని ఈ రిపోర్ట్ ను బట్టి తెలుస్తోంది.

64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను
చైనీస్ టిప్‌స్టర్ గీక్‌బార్ ప్రకారం ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుందని తెలిసింది. బేస్ వేరియంట్ స్టోరేజ్ గతేడాది లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ కంటే రెండింతలు ఎక్కువ.

తోషిబా, శాన్‌డిస్క్ కు
64జీబీ, 256జీబీ చిప్స్ తోషిబా, శాన్‌డిస్క్ కు చెందినవి కాగ, 512జీబీ చిప్స్ శాంసంగ్, హైనిక్స్‌వి అయి ఉంటాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి
సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తాయట. ఇవన్నీ నిజమైతే మరికొన్ని రోజుల్లోనే ఐఫోన్ 8 మార్కెట్లోకి రానుంది.


Click it and Unblock the Notifications








