శాంసంగ్‌కు పట్టిన గతే ఆపిల్‌కు, షాకిచ్చిన iPhone 8, iPhone 8 Plus !
ఆపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐ ఫోన్ 8 , 8 ప్లస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి నెల రోజులు కూడా(భారత్‌లో సెప్టెంబర్ 29) గడవకముందే షాకింగ్ నివేదికలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఆపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐ ఫోన్ 8 , 8 ప్లస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి నెల రోజులు కూడా(భారత్‌లో సెప్టెంబర్ 29) గడవకముందే షాకింగ్ నివేదికలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో శాంసంగ్ ఎదుర్కున్న సమస్యే ఇప్పుడు ఆపిల్ కంపెనీకి చుట్టుకుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లలో బ్యాటరీ సమస్యలు తలెత్తున్నాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.

ఇద్దరు వినియోగదారులు పోస్ట్ చేసిన పోస్టులు..
జపాన్ అలాగే తైవాన్ దేశాల్లోని ఇద్దరు వినియోగదారులు పోస్ట్ చేసిన పోస్టులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కొత్త ఐ ఫోన్లలో బ్యాటరీపరంగా సమస్యలు తలెత్తినట్టు వీరు పోస్ట్ చేశారు.

ఫోన్ ముందు భాగం ఊడి బయటకు
తైవాన్ మీడియా అందించిన సమాచారం ప్రకారం ఐ ఫోన్ 8 బ్యాటరీ బ్యాటరీ ఉబ్బిపోయింది. ఈ భాగం ఫోన్ ముందు భాగం ఊడి బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

ఛార్జింగ్ పెట్టిన మూడు నిముషాలకే..
తైవాన్‌కి చెందిన మహిళ మిస్. వూ 64 జీబీ స్టోరేజ్ రోజ్ గోల్డ్ ఐ ఫోన్ 8ప్లస్ కొనుగోలు చేశారు. ఐదు రోజుల తరువాత ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌తో ఛార్జింగ్ పెట్టిన మూడు నిముషాలకే ఫోన్ ముందు భాగం ఉబికి వచ్చింది.

మరో సంఘటనలో..
చైనాలో చోటు చేసుకున్న మరో సంఘటనలో వినియోగదారుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫోన్ తన చేతికి వచ్చేటప్పటికే బాడీనుంచి స్క్రీన్ పూర్తిగా విడిపోయి కనిపించిందని ఐ ఫోన్ 8 ప్లస్ ఓనర్ వాపోయారు. దీనిపై విశ్లేషణ కోసం కొన్ని డివైస్‌లను ఆపిల్ సంస్థకు తిరిగి పంపిస్తున్నారట.

ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఏఊటీఎల్) కంపెనీనే..
అంతేకాదు శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లకు కారణమయిన బ్యాటరీ ఉత్పత్తిదారు ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఏఊటీఎల్) కంపెనీనే ఐ ఫోన్ 8, 8ప్లస్ బ్యాటరీలను రూపొందించినట్టుగా ఓ అనధికారిక వార్త చక్కర్లుకొడుతోంది.

ఐఫోన్8 లో కొన్ని ఆడియో సమస్యలు..
మరోవైపు దేశీయంగా కూడా ఐఫోన్8 లో కొన్ని ఆడియో సమస్యలు ఉత్పన్నమైనట్టుగా ఓ టెక్ నిపుణుడు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఆపిల్ ను సంప్రదించినపుడు అది కేవలం నెట్‌వర్క్ సమస్య అని అన్నారట. ఈ వార్తలపై ఆపిల్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో..
కాగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ భారీ నష్టాలు మూటగట్టుకుంది. అలాగే ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లు ఐ ఫోన్, ఐ ఫోన్ 7ప్లస్ పేలుళ్లు అక్కడక్కడా నమోదైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








