Home
Mobile

ఈ ఫోన్ ఖర్చు 16వేలు, అమ్మేది 63 వేలకి..

అత్యంత ఖరీదైన ఫోన్లుగా భావించే ఆపిల్ ఐఫోన్లపై రోజుకో న్యూస్ బయటకొస్తోంది. లేటెస్ట్ గా లాంచ్ అయిన ఐఫోన్8, 8ప్లస్‌ల తయారీ ఖర్చుపై ఇప్పుడు దిమ్మ తిరిగే న్యూస్ లు బయటకొస్తున్నాయి.

By Hazarath

అత్యంత ఖరీదైన ఫోన్లుగా భావించే ఆపిల్ ఐఫోన్లపై రోజుకో న్యూస్ బయటకొస్తోంది. లేటెస్ట్ గా లాంచ్ అయిన ఐఫోన్8, 8ప్లస్‌ల తయారీ ఖర్చుపై ఇప్పుడు దిమ్మ తిరిగే న్యూస్ లు బయటకొస్తున్నాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అధ్యయన రిపోర్టు ప్రకారం ఐఫోన్‌ ఖర్చుగా ఆపిల్‌ 247.51 డాలర్లను, ఐఫోన్‌ 8 ప్లస్‌ ఖర్చుగా 288.08 డాలర్లుగా వెచ్చించినట్టు తెలిసింది.

iphone 8

అంటే దేశీయ కరెన్సీ ప్రకారం ఐఫోన్‌ 8 తయారీ కోసం సుమారు రూ.16వేలు, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం రూ.19వేలను ఖర్చుచేసినట్టు వెల్లడైంది. ఇది కేవలం ఈ కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్‌ వెచ్చించిన ఖర్చులో సగ భాగం మాత్రమేనని తెలిపింది. ప్రస్తుత అధ్యయనంలో లేబర్, మార్కెటింగ్‌, రీసెర్చ్‌ వ్యయాలను కలుపలేదు. పాపులర్‌ హై-ఎండ్‌ ఫోన్ల తయారీ ఖర్చుపై ఈ అధ్యయనాన్ని ప్రతేడాది మార్కిట్‌ రీసెర్చ్‌ చేపడుతోంది.

ఐఫోన్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64వేల నుంచి..

ఐఫోన్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64వేల నుంచి..

ఐఫోన్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64వేల నుంచి ఆపిల్‌ విక్రయిస్తుండగా... ఐఫోన్‌ 8 ప్లస్‌ ధర రూ.73వేలు ఉంది. గ్లోబల్‌ మార్కెట్‌లలో అమ్మకానికి వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు భారత్‌లో సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం కాగా, సెప్టెంబర్‌ 29 నుంచి ఇవి విక్రయానికి వచ్చాయి.

ఐఫోన్‌ ఎక్స్‌ కూడా..

ఐఫోన్‌ ఎక్స్‌ కూడా..

ఐఫోన్‌ ఎక్స్‌ కూడా భారత్‌లో నవంబర్‌ 3 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.89వేలు.

ఐఫోన్‌ ఎక్స్‌ తయారీ కోసం

ఐఫోన్‌ ఎక్స్‌ తయారీ కోసం

అయితే ఐఫోన్‌ ఎక్స్‌ తయారీ ఖర్చును మాత్రం ఐహెచ్‌ఎస్‌ గణించలేదు. ఐఫోన్‌ ఎక్స్‌ తయారీ కోసం ఆపిల్‌ భారీ మొత్తంలో ఖర్చు చేసి ఉంటుందని మాత్రం ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ చెప్పింది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8కు సమానంగా

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8కు సమానంగా

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనావేస్తోంది.

గెలాక్సీ ఎస్‌8 మొత్తం తయారీ ఖర్చు 307 డాలర్లు

గెలాక్సీ ఎస్‌8 మొత్తం తయారీ ఖర్చు 307 డాలర్లు

అంతకముందు ఐహెచ్‌ఎస్‌ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్‌8 మొత్తం తయారీ ఖర్చు 307 డాలర్లు.

Best Mobiles in India

English summary
iPhone 8 Plus teardown reveals it costs around Rs 19,000 to manufacture: Report Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X