Home
Mobile

iPhone Air విడుదల.. సన్నని, శక్తివంతమైన, అదిరిపోయే ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్..!

ఆపిల్ Awe Dropping ఈవెంట్‌ లో ఐఫోన్ ఎయిర్‌ స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేసింది. అత్యంత సన్నని డిజైన్‌ ను కలిగి ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ మోడల్‌ కు పోటీనిచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం ఐఫోన్ 16 సిరీస్‌ లో ప్లస్‌ మోడల్‌ను లాంచ్ చేయగా.. ఐఫోన్‌ 17 సిరీస్‌ లో (Apple iPhone 17 Series) మాత్రం ప్లస్‌ మోడల్‌ కు బదులుగా ఎయిర్‌ మోడల్‌ను తీసుకొచ్చారు. ఐఫోన్ ఎయిర్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ఐఫోన్ ఎయిర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు :
ఐఫోన్‌ ఎయిర్‌ (iPhone Air) 6.5 అంగుళాల సూపర్‌ రెటీనా XDR ప్రోమోషన్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 10-120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ సిరామిక్‌ షీల్డ్‌ 2 రక్షణ పొందుతుంది.

iPhone air smartphone launched

సన్నని ఐఫోన్ మోడల్ :
ఈ ఫోన్‌ 5.6mm థిక్‌నెస్‌ ను మాత్రమే కలిగి ఉంది. ప్రస్తుతానికి అత్యంత సన్నని ఐఫోన్ మోడల్‌ గా ఉంది. 80 శాతం రిసైకిల్‌ చేసిన టైటానియం మెటీరియల్స్‌ తోనే తయారు చేసినట్లు చెబుతోంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఐఫోన్ ఎయిర్‌ మోడల్‌ A19 ప్రో SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. 6 కోర్‌ CPU, 6 కోర్‌ GPU, 16 కోర్‌ Neural ఇంజిన్‌ను కలిగి ఉంది. iOS 26 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు N1 చిప్‌, C1x మోడెమ్‌ను కూడా కలిగి ఉంది.

వెనుక వైపు సింగిల్‌ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు సింగిల్‌ కెమెరాను కలిగి ఉంది. సెన్సర్‌ షిఫ్ట్‌ ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్, f/1.6 అపేచర్‌, 2x టెలిఫోటో సామర్థ్యంతో 48MP ఫ్యూజన్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 18MP సెంటర్‌ స్టేజ్‌ కెమెరాను అమర్చారు.

బ్యాటరీ లైఫ్‌ :
అయితే ఐఫోన్‌ ఎయిర్‌ బ్యాటరీ వివరాలను ఆపిల్ వెల్లడించలేదు. అయితే ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి రోజంతా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చని తెలిపింది. సింగిల్ ఛార్జింగ్‌ తో 27 గంటల వీడియో ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చని ఆపిల్ చెబుతోంది.

ఐఫోన్ ఎయిర్‌ ధర, సేల్‌ వివరాలు :
ఐపోన్ ఎయిర్‌ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉంది. అదే 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,39,900, 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,900 గా ఉంది.

ఈ ఫోన్‌ ను సెప్టెంబర్ 12 వ తేదీ నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్‌ 19 వ తేదీ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌ ఎయిర్‌ స్మార్ట్‌ఫోన్‌ స్కై బ్లూ, లైట్‌ గోల్డ్‌, స్పేస్ బ్లాక్‌, క్లౌడ్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
iPhone air smartphone launched with ultra slim design, A19 pro chipset, iOS 26 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X