మీ అందానికి రేటింగ్ కావాలా..?

Posted By: Prashanth

మీ అందానికి రేటింగ్ కావాలా..?

 

‘సాంకేతిక పరిజ్ఞానం నానాటికి విస్తరిస్తున్న తీరు మానవ మేధస్సుకు అద్దం పడుతోంది. ఇటీవల బ్రిటిన్ సంస్థ రూపొందించిన ఓ సాఫ్ట్‌వేర్ మనషి అందాన్ని లెక్కగట్టేస్తుంది.’

అందంగా ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఎదుటివారు తమ అందం గురించి ప్రశంసిస్తే ఉబ్బితబ్బిబ్బవడం మానవ సహజం. తమ అందాన్ని అద్దంలో మరీమరీ చూసుకోవడం, తమ స్నేహితుల్ని అడిగి తెలుసుకోవడం సహజం. ఇక మీదట అందంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు ఇంతగా శ్రమపడాల్సిన పని లేదంటోంది బ్రిటన్‌కు చెందిన సెలక్ట్‌ మోడల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ. ఐఫోన్‌ అప్లికేషన్‌ సాయంతో మీరు బ్యూటిఫుల్‌గా ఉన్నారా లేదా అన్నది ఠక్కున తెలుసుకోవచ్చని చెబుతోంది.

మోడల్‌ పొటెన్షియాలిటీ అనే ఐ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌తో ఇది సాధ్యమని చెబుతోంది. మొదటగా ఈ సాఫ్ట్‌వేర్‌ ముఖాన్ని స్కానింగ్‌ చేస్తుంది. ఆ తర్వాత వివిధ కోణాల్లో ఫోటోల్ని తీసుకుంటుంది. వయసు, ఎత్తు, ముఖం ఆకారం, జుట్టు రంగు, కళ్లతోపాటు మరికొన్ని వివరాలు అడుగుతుంది. ఇందులోని గోల్డెన్‌ రేషియో టెక్నాలజీ ఆధారంగా సదరు మనిషి అందంగా ఉన్నాడా లేదా అన్నది తేల్చేస్తుంది. 2400 ఏళ్లక్రితం గ్రీకులు, ఈజిప్షియన్లు ఈ టెక్నాలజీని ఉపయోగించారని సెలక్ట్‌ మోడల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చెపుతోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting