ఐఫోన్+ ఇండియాలో రూ.900కే!

By Prashanth
|
Apple iPhone


ఆపిల్ ఐఫోన్‌లకు దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణను క్యాష్ చేసుకునే క్రమంలో చైనాకు చెందిన ఓ మొబైల్ తయారీ బ్రాండ్ ఐఫోన్+ పేరుతో 32జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన హ్యాండ్‌సెట్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోన్ ధర కేవలం రూ.999 కావటం మరో విశేషం. ఈ ఫోన్ బ్యాకప్ ప్యానల్‌ను తిలికించినట్లయితే ఒరిజినల్ ఆపిల్ ఐఫోన్ తరహాలో ‘డిజైనుడ్ బై ఆపిల్ ఇన్ కాలిఫోర్నియా ఆసెంబుల్డ్ ఇన్ చైనా’ అగే ట్యాగ్‌లైన్ ముద్రించి ఉంది. liPhoneగా పేర్కొనబడుతున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో ఎంత క్రేజ్ సృష్టిస్తుందో వేచి చూడాలి. ఫోన్ ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చైనా మొబైల్స్‌కు ఇండియన్ మార్కెట్ గతకొన్ని సంవత్సరాలుగా స్వర్గధామంలా నిలుస్తోంది. అచ్చుగుద్దినట్లు బ్రాండెడ్ ఫోన్‌లలో ఉండే ఫీచర్లను కలిగి తక్కువ ధరలకే ఈ నకిలీ మొబైల్స్ లభ్యమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం IMEI నెంబర్ సరిలేని ఫోన్‌లను కొనుగోలు చేయటం చట్టరిత్యా నేరం. వీటిలో రేడియోషన్ నియంత్రణ ఉండదు. నకిలీ బ్రాండ్‌ల ఫోన్‌లు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నప్పటికి ప్రభుత్వ చర్యలు మాత్రం నామ మాత్రమే.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X