10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా!!

Posted By:

యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్ ఉత్పత్తుల కోసం రోజురోజుకు అభివృద్థిం చెందుతోన్న అప్లికేషన్ లను యాపిల్ యూజర్లు ఆధునిక జీవనశైలిని మరింత సౌకర్యవంతం చేసుకుంటున్నారు. మార్కెట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకుంది. ఆయా ఆపరేటింగ్ ప్లాట్ ఫామ్ ల కోసం వివిధ అంశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న యాప్స్ వినియోగదారుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతుతన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్రేజీ ఉపయోగాలతో రూపుదిద్దుకున్న 10 సరికొత్త ఐఫోన్ అప్లికేషన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Storehouse (స్టోర్ హౌస్)

ఈ అద్భుతమైన ఫోటో షేరింగ్ అప్లికేషన్ ద్వారా ఫోటోలు చిత్రీకరించుకుని వాటిని అద్భుతమైన లేఅవుట్ లతో ఫార్మాట్ వాటిని స్టోరీ రూపంలో మిత్రులకు షేర్ చేసుకోవచ్చు.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Next Glass (నెక్స్ట్ గ్లాస్)

ఈ ఉపయోగకర యాప్ 23,000 బాటిళ్ల వైన్ ఇంకా బీర్‌లకు సంబంధించిన సమాచారాన్ని తన వ్యవస్థలో నిక్షిప్తం చేసుకుంది. ఏదైనా వైన్ లేదా బీర్ బాటిల్ ను ఈ ఐఫోన్ యాప్ ద్వారా స్కాన్ చేసినట్లయితే ఆ బాటిల్ లోని న్యూట్రీషియన్ ఇంకా ఆల్కాహాల్ కంటెంట్ కు సంబంధించిన సమచారాన్ని మీకు వెల్లడిస్తుంది.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Pedometer++(పిడోమీటర్ ++)

ఈ అప్లికేషన్ మీ రోజువారి ఫిట్నెస్ కదిలకలను విశ్లేషణ చేసి తగు సూచనలను జారీ చేస్తుంది.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Paper - stories from Facebook (పేపర్ - స్టోరీస్ ఫ్రమ్ ఫేస్‌బుక్)

ఈ యాప్ ద్వారా ఐఫోన్ యూజర్లు తమ ఫేస్ బుక్ అకౌంట్ లో చూసిన స్టోరీలను భిన్నమైన లేఅవుట్ డిజైన్ లతో పాటు పూర్తి తెర ప్రదర్శనతో మిత్రులకు షేర్ చేసుకోవచ్చు.ఈ యాప్‌ను ఐట్యూన్స్ స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Litely (లైట్లీ)

ఈ శక్తివంతమైన ఫోటో అప్లికేషన్ యాప్ మీ ఫోటోలకు సబ్టిల్ ఫిల్టర్‌లు జత చేసి వాటిని క్రయేటివ్‌గా మలుస్తుంది. ఈ యాప్‌ను ఐట్యూన్స్ స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

డార్క్ స్కై (Dark Sky)

ఈ ఉపయుక్తకర యాప్ మీరు నివశించే ప్రదేశంలో చోటు చేసుకునే వాతావరణం, వర్షం, మంచుకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్‌ల రూపంలో మీ ముందుంచుతుంది. ఐఫోన్ యూజర్లు ఈ యాప్‌ను ఐట్యూన్స్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Timeful (టైమ్‌ఫుల్)

ఈ యాప్ మీ అలవాట్లను అంచనా వేసి వాటిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Humin (హ్యుమిన్)

ఈ యాప్ మీ మీటింగ్‌లకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పిటికప్పుడు మీకు గుర్తుచేస్తుంటుంది. ఇందుకు మీరు చేయవల్సిందల్లా మీరు కలవబోయే వ్యక్తికి సంబంధించిన నెంబర్‌ను హ్యుమిన్‌కు అందిస్తే చాలు మిగితా వ్యవహారం తనే చూసుకుంటుంది. ఈ యాప్‌ను ఐట్యూన్స్ స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Shortcut (షార్ట్‌కట్)

ఈ మొబైల్ బార్బర్‌షాప్ అప్లికేషన్ మీకు హెయిర్ కట్ అవసరమైనట్లయితే మీరు ఉన్న ప్రదేశానికి సంబంధించి స్థానిక బార్బర్‌ను మీకు సమకూరుస్తుంది.

 

10 ఐఫోన్ అప్లికేషన్‌లు.. ఆండ్రాయిడ్ కంటే క్రేజీగా

Manual (మాన్యువల్)

ఈ ఐఫోన్ యాప్ మీరు చిత్రకరించుబోయే ఫోటోగ్రాఫ్‌కు సంబంధించి అన్ని రకాల అడ్జస్ట్‌మెంట్‌లను పూర్తి చేసి అత్యుత్తమ అవుట్ పుట్‌ను విడుదల చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది

ఈ యాప్ మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తుంది ఇప్పటి వరకు మీరు అనేక రకాల స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను వినియోగించి ఉంటారు. తాజాగా విడుదలైన ఓ వినూత్న అప్లికేషన్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్ని యాప్‌ల కంటే భిన్నంగా కనిపిస్తోంది. అవును... ‘డెడ్‌లైన్' పేరుతో అభివృద్థి కాబడిన ఈ యాప్ వ్యక్తి మరణించే తేదీని తెలియజేస్తుంది. ఐఫోన్ హెల్త్‌కిట్‌తో కలిసి ఈ యాప్ పనిచేస్తుంది. జీస్ట్ ఎల్ఎల్‌సీ అనే సంస్థ యాపిల్ ఐఫోన్ కోసం ప్రత్యేకించి ఈ యాప్‌ను డిజైన్ చేసింది.

వ్యక్తి రోజువారి జీవనశైలి, వ్యాయామం, బ్లడ్ ప్రెజర్, ఎత్తు, నిద్ర తదితర ఆరోగ్య సంబంధిత అంశాలను డెడ్‌లైన్ యాప్ విశ్లేషిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లో నిక్షిప్తం చేసిన హెల్త్‌కిట్ యూజర్‌కు సంబంధించి రోజులో నిద్రపోయే సమయం, చేసే వ్యాయమం, బీపీ తదితర ఆరోగ్య సంబంధిత అంశాలను లెక్కించి రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో పాటు సదరు వ్యక్తి జీవన శైలికి సంబంధించి మరికొన్ని వివరాలను డెడ్‌లైన్ యాప్ ప్రశ్నల ద్వారా సేకరిస్తుంది. ఈ విధంగా వ్యక్తి జీవిత కాలాన్ని విశ్లేషించి.. మరణించే తేదీని, సమయాన్ని ఈ యాప్ వెల్లడిస్తుంది.

English summary
10 iPhone Only Apps That Will Make Your Android Friends Jealous. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot