యాపిల్ ఐఫోన్ నుంచి మంటలు!

Posted By:

ప్రముఖ ఐఫోన్‌ల తయారీ కంపెనీ యాపిల్ మరోసారి వివాదాస్సద వార్తల్లో నిలిచింది. జేబులోని ఐఫోన్ నుంచి మంటల చెలరేగటంతో అమెరికాలోని మెయినీ (Maine) ప్రాంతానికి 13 సంవత్సరాల బాలికకు మొదటి ఇంకా రెండవ డిగ్రీ కాలినగాయాలు అయినట్లు WMTW.com ఓ కథనాన్ని ప్రచురించింది.

 యాపిల్ ఐఫోన్ నుంచి మంటలు!

సదరు వెబ్‌సైట్ తెలిపిన వివరాల మేరకు  ఈ బాలిక క్లాస్‌లో కూర్చొని ఉండగా ఆకస్మాత్తుగా ప్యాంట్ వెనుక బేబులోంచి పొగలు రావటం మొదలైంది. కొద్ది సెకన్లలోని మంట చెలరేగటంతో బాధితురాలి సమీపంలో ఉన్న ముగ్గురు సహచర విద్యార్ధులు మంటలను నియంత్రించేందకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన క్లాస్ టీచర్ మంటలను నియంత్రించే ఫైర్ సిలెండర్ ద్వారా సదరు బాలికను రక్షించారు. వెంటనే ఆమెను దక్షిణ మెయినీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ఫోన్ వెనుక జేబులో ఉండటంతో కూర్చొన్న సమయంలో ఒత్తిడి అధికమై బ్యాటరీ ‘షార్ట్ అవుట్' కావటంతో ఈ ప్రమాదం తలెత్తినట్లు అగ్నిమాపక శాఖ ఈఎమ్ఎస్ డివిజన్ చీఫ్ ఆండ్రూ పాల్మిరీ తమ దర్యాప్తులో భాగంగా వెల్లడించారు.

ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ అగ్నిప్రమాదాలు తరచూచోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ అంశాలను పరిగణంలోకి తీసకుని ప్రమాణాలాకు తగట్లుగాస్మార్ట్‌ఫోన్‌‌లను తయారుచేస్తే బాగుంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot