అమెజాన్‌లో ఐఫోన్ పెస్టివల్, డిస్కౌంట్‌లో లభిస్తున్న ఫోన్లు ఇవే !

|

అమెజాన్ ఇండియా చాలా రోజుల తరువాత మళ్లీ ఆపిల్ ఐఫోన్ పెస్టివల్‌కి తెరలేపింది. పలు ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్స్ పై ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. అయితే ఈ ఫోన్లను కేవలం హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ ఈఎంఐ లావాదేవీలపై కూడా వాలిడ్‌లో ఉంటుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌, జూన్‌ 12 వరకు కొనసాగుతోంది. డిస్కౌంట్ పొందిన వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

 

ఇండియా మార్కెట్లోకి షియోమి మరో కొత్త ఫోన్, బెస్ట్ ఫీచర్స్ ఇవే..ఇండియా మార్కెట్లోకి షియోమి మరో కొత్త ఫోన్, బెస్ట్ ఫీచర్స్ ఇవే..

ఐఫోన్‌ ఎక్స్‌

ఐఫోన్‌ ఎక్స్‌

4,001 రూపాయల ఫ్లాట్‌ డిస్కౌంట్‌, అదనంగా 4 వేల రూపాయల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌.
అమెజాన్‌లో రూ.89వేలుగా లిస్ట్‌ అయిన ఈ ఫోన్‌, రెండు డిస్కౌంట్ల అనంతరం రూ.80,999కే అందుబాటులోకి వచ్చింది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,600 ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది.

 ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ 8

ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ 8

ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ 8 స్మార్ట్‌ఫోన్లపై కూడా 3 వేల రూపాయల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను కస్టమర్లు పొందవచ్చు. రూ.1,001 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ అనంతరం ఐఫోన్‌ 8 ప్లస్‌ను రూ.71,999కు అమెజాన్‌ విక్రయిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను పొందవచ్చు.
4వేల రూపాయల డిస్కౌంట్‌ అనంతరం ఐఫోన్‌ 8 రూ.59,999కు అందుబాటులోకి వచ్చింది. దీనిపై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఐఫోన్‌ 7
 

ఐఫోన్‌ 7

ఐఫోన్‌ 7పై యూజర్లు 2 వేల రూపాయల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను పొందనున్నారు. 45,999 రూపాయలకు విక్రయించే ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.6,371 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను అమెజాన్‌ అందిస్తోంది. ఈ ఫోన్‌పై కూడా రూ.14,600 ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఐఫోన్‌ 6 ఎస్‌, ఐఫోన్‌ 6ఎస్ ప్లస్‌

ఐఫోన్‌ 6 ఎస్‌, ఐఫోన్‌ 6ఎస్ ప్లస్‌

ఇలా ఐఫోన్‌ 6 ఎస్‌, ఐఫోన్‌ 6ఎస్ ప్లస్‌, ఐఫోన్‌ ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ అన్నింటిపై అమెజాన్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. 

రూ.250 అదనపు క్యాష్‌బ్యాక్‌

రూ.250 అదనపు క్యాష్‌బ్యాక్‌

పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ప్రతి కొనుగోలుపై రూ.250 అదనపు క్యాష్‌బ్యాక్‌నూ అమెజాన్‌ నేడు ఆఫర్‌ చేస్తోంది. కాగా అమెజాన్‌ ఇండియా ఐదో వార్షికోత్సవంలో భాగంగా ఈ క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

Best Mobiles in India

English summary
iPhone Fest is back on Amazon, here are all the offers you can get More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X