ఆపిల్ కంపెనీకి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కసారిగా ధరలు పైకి !

Written By:

గత వారంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు విదేశీ కంపెనీలు డైలామాలో పడ్డాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీపై ఈ ప్రభావం బాగా పడింది. దీంతో కంపెనీ ఇండియాలో తన ఐఫోన్ ధరలను అమాంతం పెంచేసింది.

జియో నుంచి మరో దుమ్ము రేపే ఫీచర్..

ఆపిల్ కంపెనీకి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కసారిగా ధరలు పైకి !

మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, టెలివిజన్‌పై దిగుమతి పన్నుల సుంకాన్ని 10నుంచి 15 శాతంగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆపిల్ కంపెనీ మొత్తం ఐఫోన్ పరిధి ధరల్లో మార్పులు చేసింది.పెరిగిన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఫేస్‌బుక్‌లోకి కొత్త ఫీచర్, అన్‌ఫ్రెండ్ చేయలేని వారికి ఉపశమనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్‌

ఐఫోన్ 6 రూ. 30,780 (ముందు రూ. 29,500), ఐఫోన్ ఎక్స్‌ ఇప్పుడు రూ. రూ. 89,000 లు పలకనుంది.

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ వరుసగా రూ. 66,120 , రూ. 75,450  (పాత ధరలురూ. 64,000 మరియు రూ. 73,000) .

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్

ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్ ఇప్పుడు వరుసగారూ. 50,810 , రూ. 61,060లుగా నిర్ణయించింది.

ఐఫోన్ 6,ఐఫోన్ 6s ప్లస్

అలాగే ఐఫోన్ 6, ఐఫోన్ 6s ప్లస్ ప్రారంభ ధర ఇప్పుడు వరుసగా రూ. 41,550 , రూ. 50,740లు.

విదేశీ మొబైల్స్‌ దిగుమతి పన్నును 15 శాతంగా ..

కాగా స్వదేశీ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహాన్నిచ్చే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ మొబైల్స్‌ దిగుమతి పన్నును 15 శాతంగా నిర‍్ణయించింది. టీవీలు, మైక్రోవేవ్‌ ఒవెన్లు తదితరాలపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone Prices in India Marginally Increased After Import Tax Hike More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot