ఐఫోన్ SE 4: లీకైన డమ్మీ యూనిట్స్.. యాపిల్ బడ్జెట్ కింగ్ ఎలా ఉండబోతోందో చూడండి!
యాపిల్ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ SE 4 త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ హాట్ టాపిక్‌కు మరింత ఊపునిస్తూ, ప్రముఖ లీక్ వీరుడు సన్నీ డిక్సన్ (@SonnyDickson) తన X (ట్విట్టర్) ఖాతాలో ఈ ఫోన్ డమ్మీ యూనిట్ల ఫొటోలను లీక్ చేశాడు. దీంతో ఈ ఫోన్ ఎలా ఉండనుందో ఓ క్లారిటీ వచ్చేసింది. నలుపు, తెలుపు రంగుల్లో కనిపించిన ఈ డమ్మీ యూనిట్లు, డిజైన్ పరంగా ఐఫోన్ 14ను తలపిస్తున్నాయి. గతంలో వచ్చిన రూమర్స్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పాయి.
ఈ ఫోన్ చుట్టూ ఫ్లాట్ సైడ్స్ ఉండగా, వెనుకవైపు లెఫ్ట్ కార్నర్‌లో ఒకే కెమెరా, పక్కనే LED ఫ్లాష్‌ను చూడొచ్చు. ఫోన్ ఎడమవైపు వాల్యూమ్ బటన్లు, మ్యూట్ స్విచ్, సిమ్ ట్రే ఉన్నాయి. అయితే, ఇంతకుముందు వినిపించిన యాక్షన్ బటన్ మాత్రం ఈ డమ్మీ యూనిట్లలో కనిపించకపోవడం గమనార్హం.

* ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నాయి..
ఐఫోన్ SE 4ని బహుశా ఐఫోన్ 16E అని కూడా పిలిచే అవకాశం ఉంది. ఇది కొత్త ఫీచర్లతో దుమ్ము రేపడానికి సిద్ధమవుతోంది. అవేంటో చూద్దామా,
- డిస్‌ప్లే: 6.06-అంగుళాల ఫుల్-HD+ LTPS OLED స్క్రీన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది.
- కెమెరా: SE సిరీస్‌లో ఇప్పటివరకు లేని విధంగా బ్యాక్ 48-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వనున్నారు. అంటే ఫొటో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుంది.
- ప్రాసెసర్: యాపిల్ ప్రీమియం ఫోన్లలో వాడే పవర్‍ఫుల్ A18 బయోనిక్ చిప్‌తో ఈ ఫోన్ రానుంది.
- వేరియంట్స్: 6GB, 8GB RAM ఆప్షన్లలో అందుబాటులో ఉండొచ్చు.
- బిల్డ్: అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు వాటర్‌ప్రూఫ్ డిజైన్, USB టైప్-C పోర్ట్ దీని సొంతం.
- ఇతర ఫీచర్లు: ఫేస్ ID సపోర్ట్ ఉంటుంది. ఇక హోమ్ బటన్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పినట్లే.
First look at the iPhone SE 4 Dummy pic.twitter.com/qL0COgmPPA
— Sonny Dickson (@SonnyDickson) January 16, 2025
* ఎప్పుడొస్తుంది.. ఎంత ఉంటుంది..
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఐఫోన్ SE 4 2025, ఏప్రిల్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర దాదాపు 500 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.46,000) ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
* ఐఫోన్ SE 4లో డ్యూయల్ కెమెరా మిస్సింగ్..
యాపిల్ విజన్ ప్రో కోసం స్టెరియోస్కోపిక్ వీడియో రికార్డింగ్ ఫీచర్ కోసం రెండు లెన్స్‌ల మెయిన్ కెమెరా సిస్టమ్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఇక్కడ కనిపిస్తున్న ఐఫోన్ SE 4 డమ్మీ మాత్రం సింగిల్ లెన్స్‌తోనే కనిపించింది.
* యాపిల్ ఇంటెలిజెన్స్‌తో ఐఫోన్ SE
ఐఫోన్ SEతో పాటే iOS 18 అప్‌డేట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. యాపిల్ తీసుకొస్తున్న సరికొత్త జనరేటివ్ AI ప్రయత్నాలైన యాపిల్ ఇంటెలిజెన్స్ మొదటి దశ iOS 18.3తో పూర్తవుతుంది. ఇది కూడా 2025 మొదటి నెలల్లోనే రిలీజ్ కానుంది. అంటే, ఐఫోన్ SE సరికొత్త AI టూల్స్‌తో మార్కెట్లోకి రావొచ్చు. దీంతో బడ్జెట్ ధరలో AI మ్యాజిక్ చూడొచ్చు.
* సరికొత్త బెంచ్‌మార్క్
లీకులు నిజమైతే, ఐఫోన్ SE 4 తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. ఐఫోన్ 14 తరహా డిజైన్, అదిరిపోయే కెమెరా, పవర్‍ఫుల్ హార్డ్‌వేర్‌తో, యాపిల్ బడ్జెట్ ఫోన్ల విభాగంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








