ఐఫోన్ SE 4, గెలాక్సీ S25 ఎడ్జ్, ఇంకా 2025లో లాంచ్ అయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!
Smartphone Launches of 2025: ఏటా కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి, టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అంతే. శామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఆల్రెడీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ 2025 ఇంకా చాలా ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు దాచిపెట్టింది. మరోవైపు యాపిల్, నథింగ్, శామ్‌సంగ్, ఒప్పో లాంటి పెద్ద బ్రాండ్లన్నీ కొత్త ఫోన్లను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది రిలీజ్ కాబోయే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఏవో చూద్దాం.
* యాపిల్ ఐఫోన్ SE 4
యాపిల్ కంపెనీ ఐఫోన్ SE 4ని ఈ రోజు లేదా ఈ వారంలో ఎప్పుడైనా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. SE సిరీస్ అంటేనే చిన్న సైజు, సింపుల్ డిజైన్ అని అందరికీ తెలుసు. కానీ ఈసారి ఐఫోన్ SE 4 సైజు ఐఫోన్ 16 అంత ఉంటుంది, పైగా ఎడ్జ్-టు-ఎడ్జ్ OLED డిస్‌ప్లేతో వస్తోంది.

ఐఫోన్ 16లో వాడిన పవర్‌ఫుల్ చిప్‌నే ఇందులో కూడా వాడొచ్చు. AI ఫీచర్లు కూడా ఉంటాయంటున్నారు. USB-C ఛార్జింగ్ పోర్ట్ రావడం మరో పెద్ద అప్‌గ్రేడ్. మిగతా ఐఫోన్లకి రెండు కెమెరాలు ఉంటే, దీనికి మాత్రం వెనుకవైపు ఒకే కెమెరా ఉంటుంది, అది కూడా 48MP సెన్సార్ కెమెరా.
డిజైన్ అయితే ఐఫోన్ 14ని చూసినట్టే ఉంటుంది. దీని ధర సుమారు రూ.49,000 (500 డాలర్ల లోపే) ఉంటుందని అంచనా. ఇంకా డిస్కౌంట్లు కలుపుకుంటే ఇది మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. తద్వారా మధ్య తరగతి ప్రజలు కూడా ఐఫోన్ కొనుగోలు చేయగలుగుతారు.
* ఒప్పో ఫైండ్ N5
ఒప్పో ఫైండ్ N5 ఫోల్డింగ్ ఫోన్, కానీ చూడటానికి మాత్రం అస్సలు అలా అనిపించదు. ప్రపంచంలోనే ఇది అతి చిన్న ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ అని ఒప్పో కంపెనీ చెబుతోంది. ఇది చాలా సన్నగా ఉంటుంది, ఇంకా డిస్‌ప్లే మీద క్రీజ్ కూడా కనిపించదట. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
* నథింగ్ ఫోన్ 3a
నథింగ్ కంపెనీ త్వరలోనే నథింగ్ ఫోన్ 3a ని లాంచ్ చేయబోతోంది. ఇది తక్కువ ధరలో, అంటే రూ.30,000లోపే వచ్చే స్మార్ట్‌ఫోన్. కెమెరా క్వాలిటీ బాగుంటుంది అంటున్నారు. ఐఫోన్ 16లో ఉన్నట్టుగా దీనికి కూడా సైడ్ షట్టర్ బటన్ స్పెషల్ అట్రాక్షన్. నథింగ్ ఫోన్లకు ఉండే ప్రత్యేకమైన గ్లిఫ్ లైటింగ్ డిజైన్ ఇందులో ఉంటుంది.
* శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్
శామ్‌సంగ్ S25 సిరీస్ లాంచ్ చేసినప్పుడే గెలాక్సీ S25 ఎడ్జ్ గురించి టీజ్ చేసి అందరికీ ఫుల్ కిక్ ఇచ్చింది. కానీ మిగతా S25 మోడల్స్‌తో పాటు దీన్ని రిలీజ్ చేయలేదు. ఈ ఫోన్ అయితే మరీ సన్నగా ఉండబోతోంది. అందుకే దీనికి 'స్లిమ్’ అని పేరు పెడతారని చాలామంది అనుకున్నారు,
కానీ శామ్‌సంగ్ వేరే పేరు ఫిక్స్ చేసింది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర విషయంలో అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇంకో సన్నటి స్మార్ట్‌ఫోన్ కూడా ఈ ఏడాది చివర్లో రాబోతోంది, అదే యాపిల్ నుంచి ఐఫోన్ 17 ఎయిర్, దీని ధర ఎంత ఉంటుందో చూడాలి.
* గూగుల్ పిక్సెల్ 9a
గూగుల్ కంపెనీ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌కి తక్కువ ధర ఆప్షన్‌గా పిక్సెల్ 9a ని రెడీ చేస్తోంది. పిక్సెల్ ఫోన్లు అంటేనే కెమెరాలు అదిరిపోతాయి, ఇక ఈ మోడల్‌లో రెండు వెనుక కెమెరాలు ఉండబోతున్నాయ్. టెన్సార్ G4 చిప్‌తో పాటు 8GB RAM కూడా ఉంటుంది, AI ఫీచర్ల కోసం అన్నమాట.
దీని ధర 450 డాలర్లలోపే ఉండొచ్చు. గూగుల్ ఈ ఫోన్‌ని మార్చి 19న రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లు అదిరిపోయే డిజైన్లతో, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఫోల్డింగ్ ఫోన్ కావాలన్నా, బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ కావాలన్నా, లేదంటే హై-ఎండ్ డివైజ్ కావాలన్నా, 2025లో మీకోసం ఏదో ఒకటి పక్కాగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








