ఐఫోన్ SE 4 మోడల్ లాంచ్ టైమ్‌లైన్ లీక్.. ఊహించని డిజైన్, ఫీచర్‌లు..!
ఆపిల్ నుంచి 4వ జనరేషన్ ఐఫోన్ SE (iPhone SE 4 Model) విడుదల కానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఐఫోన్ SE 4 గత మోడళ్ల కంటే మెరుగైన డిజైన్ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలిసింది. ఐఫోన్ SE సిరీస్ నుంచి ఆఖరిసారిగా 2022 లోనే హ్యాండ్‌సెట్ విడుదల అయింది. అయితే ఐఫోన్ SE 4 త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ విడుదలపై గత కొన్నిరోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టెక్ నిపుణుడు మార్క్ గుర్మన్ ఐఫోన్ విడుదల తేదీని వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం (iPhone SE 4 Launch Date) ఏప్రిల్ నెలలో 4వ జనరేషన్ ఐఫోన్ SE విడుదల కానుందని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఐఫోన్ SE 4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఐఫోన్ మోడల్ డిజైన్ ఐఫోన్ 14 తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు తొలిసారిగా SE సిరీస్‌లో ఫేస్ ఐడీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కొత్త ఐఫోన్ SE ఆపిల్ A18 బయోనిక్ చిప్‌సెట్ సహా అడ్వాన్స్‌డ్ AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని సమాచారం. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్‌తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆపిల్‌కు చెందిన 5G మోడెంతో విడుదలయ్యే అవకాశం ఉంది. USB-C ఛార్జింగ్ పోర్టుతో లాంచ్ కానుంది.
ప్రస్తుతం ఐఫోన్ మోడళ్లతో పోలిస్తే.. త్వరలో విడుదల కానుందని భావిస్తున్న SE 4 హ్యాండ్‌సెట్ ధర USD 500 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.42,000) కే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఏప్రిల్ 2025లో విడుదల అయ్యే అవకాశం ఉంది. విడుదల తేదీ సహా ఇతర వివరాలపై ఆపిల్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఆపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా ఈ సంవత్సరం ఆపిల్ 17 సిరీస్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కు సంబందించిన డిజైన్ సహా స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్ అవుతున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17 స్లిమ్ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
గత మోడళ్ల కంటే ఐఫోన్ 17 సిరీస్ మరింత ప్రత్యేకమైన డిజైన్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఐఫోన్ 6 తరహాలో రౌండ్ ఎడ్జ్‌లను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా ఫోన్‌ను కంఫర్ట్‌గా పట్టుకొనేందుకు అవకాశం ఉందంటున్నారు. గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా కెమెరా మాడ్యూల్ మరింత కొత్తగా ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 ప్రో మోడళ్లు ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్‌పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్‌ను జతచేసే అవకాశం ఉంటుంది. అదే ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ మోడళ్లలో 8GB ర్యామ్‌ను వినియోగించే అవకాశం ఉంది. మరియు ప్రో మోడళ్లు టైటానియం ఫ్రేమ్‌కు బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ను వినియోగిస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications








