Home
Mobile

iPhone SE 4 భారీ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీలతో ఐఫోన్‌ SE 4 స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!

ఆపిల్‌ నుంచి నెక్స్ట్‌ జనరేషన్‌ ఐఫోన్ ఈ సంవత్సరం రెండో భాగంలో లాంచ్‌ కానుంది. అయితే దీంతోపాటు బడ్జెట్‌ రేంజ్‌ ఐఫోన్‌ కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఇందుకు చెక్‌పెట్టేందుకు ఆపిల్‌ ఐఫోన్‌ SE 4 (iPhone SE 4) మోడల్‌ను త్వరలో లాంచ్‌ చేయనుంది. ఇప్పటివరకు కేవలం 3 హ్యాండ్‌సెట్‌లను మాత్రమే లాంచ్‌ చేసింది.

అయితే ఐఫోన్‌ SE 4 స్మార్ట్‌ఫోన్‌ గత మోడళ్లతో పోల్చుకుంటే అనేక అప్‌గ్రేడ్‌లతో రానుంది. గత మోడళ్ల కంటే పెద్ద డిస్‌ప్లే సహా శక్తివంతమైన చిప్‌సెట్‌ సహా మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ కీలక వివరాలపై కొన్ని లీక్‌లు వినిపిస్తున్నాయి.

iPhone SE 4 smartphone could be launched with bigger display

ప్రముఖ ఆపిల్ అనలిస్ట్‌ Nguyen phi Hung ఈ ఆపిల్‌ ఐఫోన్ SE 4 గురించిన కొన్ని వివరాలను అంచనా వేశారు. దీని ఆధారంగా ఈ కొత్త డివైస్‌ సుమారుగా 166 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. మరియు 7000 సిరీస్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ముందు, వెనుక గ్లాస్‌ ప్యానల్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఐఫోన్‌ SE 4 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల LTPS OLED ప్యానల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 60Hz రీఫ్రెష్‌ రేట్‌ తో రానుందని సమాచారం. దీంతోపాటు ఆపిల్‌ A16 బయోనిక్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 6GB LPDDR5 ర్యామ్ మరియు 128GB లేదా 512GB NVMe స్టోరేజీతో జతచేయబడే అవకాశం ఉంది.

ఈ ఐఫోన్‌ SE 4 స్మార్ట్‌ఫోన్‌ 3000mAh లేదా 3279mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. Magsafe ఛార్జింగ్ సపోర్టుతో 2oW వైర్‌ ఛార్జింగ్ మరియు 12W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుందని సమాచారం. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.3 మరియు USB-C కనెక్టింగ్‌ సపోర్టుతో రానుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ ఐఫోన్‌ SE 4.. f/1.8 అపేచర్‌తో మరియు 1/2.55" సైజ్‌తో IMX503 కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఈ కెమెరా 1080p సినిమాటిక్‌ మోడ్‌, డీప్‌ ఫ్యూజన్‌, స్మార్ట్‌ HDR, ఏఐ ఫోటోగ్రఫీ మరియు పొర్ట్రెయిట్‌ మోడ్‌ సపోర్టు చేస్తుందని సమాచారం.

** ఐఫోన్‌ 16 సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ విడుదల కానున్నాయి. తాజాగా వచ్చిన నివేదిక ఆధారంగా ఐఫోన్‌ 16 ప్లస్‌ ఏడు రంగుల్లో అండుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లూ, పింక్, యెల్లో, గ్రీన్‌, బ్లాక్‌, వైట్‌, పర్పల్ రంగుల్లో విడుదల కానుందని తెలుస్తోంది.

ఐఫోన్‌ 16 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు గత మోడల్‌ కంటే మెరుగైన బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ఆధారంగా ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ గరిష్ఠంగా 4676mAh బ్యాటరీ, అదే ఐఫోన్ 16 ప్రో 3355mAh బ్యాటరీ, ఐఫోన్ 16 3,516mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్లస్‌ మాత్రం 4006mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
iPhone SE 4 smartphone could be launched with bigger display and better than predecessors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X