iPhone SE 4 ఆపిల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ వీడియో, ఫొటోలు లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
ఆపిల్ నుంచి ఈ సంవత్సరం ఐఫోన్ SE 4 (iPhone SE 4 Smartphone) విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ పై అనేక లీక్స్ వచ్చాయి. ఇటీవల ఈ హ్యాండ్‌సెట్ డమ్మీ డిజైన్ లీక్ అయింది. తాజాగా ఓ టిప్‌స్టర్ ఈ ఫోన్ వీడియోలను పోస్ట్ చేశారు. దీంతోపాటు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ గత మోడళ్ల కంటే ఎన్నో అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండనుంది. బాక్సీ డిజైన్ సహా చిప్‌సెట్, కెమెరాలు, డిస్‌ప్లే, బ్యాటరీ సహా అనేక మార్పులు రానున్నాయి.
బడ్జెట్ ప్రెండ్లీ ఫోన్‌గా లాంచ్? :
సాధారణ ఐఫోన్ మోడళ్లతో పోలిస్తే ఈ ఐఫోన్ SE 4 బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో (Apple Upcoming iPhone) లాంచ్ కానుంది. అయితే చివరి సారిగా ఐఫోన్ SE మోడల్ 2022 లో లాంచ్ అయింది. కొత్త ఫోన్ శక్తివంతమైన A18 చిప్‌సెట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఫలితంగా మెరుగైన పరితీరును కనబరుస్తుందని తెలుస్తోంది.

ఒకే కెమెరాతో విడుదల కానుందా.. :
టిప్‌స్టర్ మజిన్ బు (@Majinbu) తాజాగా కొత్త ఐఫోన్ SE కు సంబంధించిన కొత్త ఫోటోలు సహా వీడియోను లీక్ చేశారు. దీని ఆధారంగా (New iPhone 2025) ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు కేవలం ఒకే కెమెరాను అమర్చి ఉంటుందని తెలుస్తోంది.
ఏ పేరుతో లాంచ్ కానుందో :
త్వరలో విడుదల కానుందని భావిస్తున్న ఐఫోన్ SE 4 వెనుక వైపు గ్లాస్ బ్యాక్ డిజైన్ తో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఐఫోన్ 16e పేరుతో విడుదల అయ్యే అవకాశం ఉందని కొన్ని లీక్స్ వస్తున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ భారత్ లో లాంచ్ అయింది.
Here's what the iPhone SE 4 looks like pic.twitter.com/pEyIAJ34VR
— Majin Bu (@MajinBuOfficial) January 25, 2025
అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వివరాలు ఆధారంగా కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ 6.06 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. చివరిసారిగా విడుదల అయిన ఐఫోన్ SE 3 హ్యాండ్‌సెట్ 4.7 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు SE మోడల్ 8GB ర్యామ్, 128GB తో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లు :
ఐఫోన్ SE 4 లేదా ఐఫోన్ 16e హ్యాండ్‌సెట్ AI సహా అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం. మరియు A18 చిప్‌సెట్‌లో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
iPhone SE 4 looks so beautiful pic.twitter.com/ezhNrrhyf8
— Majin Bu (@MajinBuOfficial) January 26, 2025
త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం : అయితే ఐఫోన్ SE 4 లేదా ఐఫోన్ 16e పేరుతో విడుదల కానుందని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్ గురించి ఆపిల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లీక్స్ ఆధారంగా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు తెలిశాయి. దీంతోపాటు లాంచ్ పైనా ఇప్పటి వరకు ఆపిల్ సంస్థ ఎటువంటి ప్రకటన వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications







