Home
Mobile

ఆపిల్‌ నుంచి బడ్జెట్‌ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీ లీక్‌.. కచ్చితంగా షాక్‌ అవుతారు..!

ఆపిల్‌ నుంచి బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఐఫోన్‌ SE 4 హ్యాండ్‌సెట్‌ (iPhone SE 4 Smartphone) గురించి ఇప్పటికే వివరాలు లీక్‌ అయ్యాయి. గత మోడల్‌ కంటే భారీ అప్‌గ్రేట్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భారీ డిస్‌ప్లే, శక్తివంతమైన కెమెరాలు సహా బ్యాటరీలను కలిగి ఉంటుందని ఇప్పటికే లీక్స్‌ వచ్చాయి. చివరిసారిగా 2022 లో ఐఫోన్‌ SE 3 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. రేపు ఉదయం విడుదల కానుందని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుంది :
ఐఫోన్‌ SE 4 స్మార్ట్‌ఫోన్‌ (Apple Upcoming Smartphone) గురించి తాజాగా కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. ఆపిల్ అనలిస్ట్‌ మార్క్ గుర్మన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి లాంచ్‌ వివరాలను వెల్లడించారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ రేపు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ నెలలోనే సేల్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

iPhone SE 4 Smartphone expected to launch date

ఏ పేరుతో లాంచ్‌ కానుంది :
ఐఫోన్ SE 4 లేదా ఐఫోన్‌ 16e పేరుతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ ఐఫోన్‌ 14 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టాప్‌ నాచ్‌ ఫ్రంట్ డిజైన్‌ సహా అల్యుమినియం ఫ్రేమ్‌, గ్లాస్‌ బిల్ట్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

ఐఫోన్‌ SE 4 హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఐఫోన్‌ SE 4 హ్యాండ్‌సెట్‌ (iPhone SE 4 Specifications) 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గత మోడల్‌ 4.7 అంగుళాల LCD డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంది. దీంతోపాటు కొత్త హ్యాండ్‌సెట్‌ ఫేస్‌ ఐడీతోపాటు టచ్‌ ఐడీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.

శక్తివంతమైన చిప్‌సెట్‌ :
ఐఫోన్‌ SE 3 తో పోలిస్తే చిప్‌సెట్‌ పరంగాను భారీ అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంటుంది. 4 జనరేషన్‌ ఐఫోన్‌ SE 8GB ర్యామ్‌తో కూడిన A18 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఫలితంగా బడ్జెట్ ధరలో శక్తివంతమైన చిప్‌సెట్‌ కలిగిన ఫోన్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ ఐఫోన్ 16 లో ఉపయోగించారు.

సింగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది! :
గత మోడల్‌ 64GB ర్యామ్ స్టోరేజీని కలిగి ఉండగా.. SE 4 మోడల్ మాత్రం 128GB స్టోరేజీ తో లాంచ్‌ కానుందని సమాచారం. కెమెరా విభాగం పరంగానూ అనేక వార్తలు వస్తున్నా.. నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 48MP సింగిల్‌ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఐఫోన్ 14 తరహా బ్యాటరీ :
ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఐఫోన్ 14 తరహా బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే 3,279mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని సమాచారం. సింగిల్ ఛార్జింగ్‌తో 20 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైం ను పొందవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

ఆపిల్‌ నుంచి ఇటీవల ఐఫోన్ 16 సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ లాంచ్‌ అయ్యాయి. ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి భారత్‌ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల సేల్‌ ప్రారంభం అయింది. బ్యాంకు ఆఫర్లతో డిస్కౌంట్‌ ధరలకు సొంతం చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone SE 4 Smartphone expected to launch on February 11 2025 check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X