Home
Mobile

ఐఫోన్ SE 4 మొబైల్ కొనాలా వద్దా.. ఈ 5 అప్‌గ్రేడ్లు చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది..

iPhone SE 4: టెక్ దిగ్గజం యాపిల్ మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరల్లో ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19న యాపిల్ సంస్థ ఐఫోన్ SE 4 మొబైల్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. బహుశా దీనికి ఐఫోన్ 16E అని పేరు కూడా పెట్టొచ్చు. ఐఫోన్ SE 4తో పోలిస్తే ఈ కొత్త మోడల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్, ఫీచర్లు అందించనుంది.

ఐఫోన్ 16 ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, ఇదీ అంతే పవర్‌ఫుల్‌గా రాబోతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఐఫోన్ SE 3 వాడుతూ, అప్‌గ్రేడ్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్‌లో ఉంటే, ఈ ఆర్టికల్ మీకోసమే. 2025లో ఐఫోన్ SE 4 బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే ఇందులో 5 అదిరిపోయే అప్‌గ్రేడ్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

iPhone SE 4 vs SE 3  Are These 5 Upgrades Worth the Hype and Your Money

* ఐఫోన్ 14ని తలపించే సరికొత్త డిజైన్..

ఐఫోన్ SE 4 డిజైన్ చూస్తే ఫిదా అయిపోతారు. ఐఫోన్ 14 లాంటి మోడ్రన్ లుక్‌తో వస్తోంది. కేసుల కంపెనీ స్పిజెన్ లీక్ చేసిన ఫొటోలు చూస్తే ఇదే అనిపిస్తోంది. హై-ఎండ్ ఐఫోన్లలో ఉన్నట్టుగానే మెటల్-గ్లాస్ బాడీతో వస్తుంది, కాకపోతే వెనుకవైపు మాత్రం ఒకే కెమెరా ఉంటుంది.

ఐఫోన్ SE 3లో హోమ్ బటన్ ఇచ్చారు కదా, ఇందులో మాత్రం ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది, ఫేస్ ID కూడా వస్తుంది. ఛార్జింగ్ పోర్ట్ విషయానికొస్తే, లైట్నింగ్ పోర్ట్‌కు బదులు USB-C పోర్ట్‌తో రాబోతుంది. అంతేకాదు, సైలెంట్ చేయడానికి పక్కన స్విచ్ ఇచ్చేవారు కదా, దానికి బదులు ఈసారి యాక్షన్ బటన్ కూడా ఇస్తున్నారు.

అలాగే ఇది IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది, అంటే నీళ్లలో పడ్డా, దుమ్ములో పడ్డా, కొట్టినా ఏమీ కాదు. కొత్త డిజైన్‌తో బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది. రేపు రిలీజ్ అయ్యాక దీని ఫొటోలు కూడా బయటకు వస్తాయి. అప్పుడు వాటిని చూసి దీన్ని కొనాలో వద్దో నిర్ణయించుకోవచ్చు.

* A18 చిప్‌తో ఫాస్ట్ పర్ఫార్మెన్స్..

ఐఫోన్ SE 4లో యాపిల్ ఏకంగా A18 చిప్‌ని పెట్టబోతోందట. ఇదే చిప్ ఐఫోన్ 16లో వాడారు. 3nm టెక్నాలజీతో వస్తున్న ఈ చిప్ చాలా పవర్‌ఫుల్, దీనివల్ల హెవీ టాస్క్‌లను కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఇంకా ఫోన్‌లోనే AI ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. 8GB RAM ఉండటంతో మల్టీ టాస్కింగ్ సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది.

ఐఫోన్ SE 4లో AAA గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుందంటున్నారు, కానీ యాపిల్ మాత్రం దీన్ని టాప్-ఎండ్ ఐఫోన్లకే లిమిట్ చేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా, ఈ పవర్‌ఫుల్ చిప్ వల్ల ఐఫోన్ SE 4 చాలా సంవత్సరాల వరకు స్మూత్‌గా పనిచేస్తుంది.

* 48MP కెమెరాతో ఫొటోలు

ఐఫోన్ SE 4లో 48MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు. దీనితో 4K డాల్బీ విజన్ వీడియోలు రికార్డ్ చేయొచ్చు, ఇంకా 2x ఇన్-సెన్సార్ జూమ్ కూడా ఉంది. కెమెరా ఒక్కటే ఉన్నా, సెన్సార్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఐఫోన్ SE 3 కంటే చాలా మంచి ఫోటోలు వస్తాయి.

సెల్ఫీల కోసం ముందువైపు 12MP కెమెరా ఇస్తున్నారు, ఫేస్ ID అన్‌లాకింగ్ కోసం కొత్త సెన్సార్లు కూడా పెడుతున్నారు. ఐఫోన్ SE 3తో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్. ఎందుకంటే SE 3లో టచ్ ఐడీ ఉంది, ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా అంతంత మాత్రమే.

* పెద్ద, బెస్ట్ డిస్‌ప్లే

ఐఫోన్ SE 3 స్క్రీన్ చూస్తే కాస్త చిన్నగా, ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే దానిది 4.7- అంగుళాల స్క్రీన్‌, చుట్టూ పెద్ద బెజెల్స్ కూడా ఉన్నాయి. కానీ SE 4లో మాత్రం 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ఇస్తున్నారు, అది కూడా ఫుల్ HD రెజల్యూషన్‌తో. అంటే పిక్చర్స్ చాలా షార్ప్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంటాయి.

ఐఫోన్ 14లో ఉన్నట్టు నాచ్ డిస్‌ప్లే ఉంటుంది, కానీ ఐఫోన్ 15, 16 లలో ఉన్న డైనమిక్ ఐలాండ్ మాత్రం ఉండదు. ఈ డిస్‌ప్లే అప్‌గ్రేడ్ వల్ల ఐఫోన్ SE 4 చూడటానికి చాలా మోడ్రన్‌గా ఉంటుంది, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

* యాపిల్ ఇంటెలిజెన్స్‌

ఐఫోన్ SE 4 iOS 18.3తో లాంచ్ అవుతుంది, యాపిల్ కొత్తగా తీసుకొస్తున్న AI సిస్టమ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది. ఐఫోన్ SE 3కి కూడా iOS 18.3 అప్‌డేట్ వస్తుంది కానీ, హార్డ్‌వేర్ లిమిటేషన్స్ వల్ల చాలా AI ఫీచర్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఐఫోన్ SE 4కి కనీసం నాలుగైదు ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి. కానీ ఐఫోన్ SE 3కి మాత్రం ఇంకో రెండేళ్లు మాత్రమే అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే, యాపిల్ ఐఫోన్‌ 3 లాగానే ఐఫోన్ SE 4 బేస్ మోడల్‌ను 64 GB స్టోరేజ్‌తోనే లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.

* చివరికి చెప్పేది ఏంటంటే

ఐఫోన్ SE 4 ఐఫోన్ SE 3తో పోలిస్తే ఒక బిగ్ అప్‌గ్రేడ్. కొత్త డిజైన్, పెద్ద డిస్‌ప్లే, హై-రెజల్యూషన్ కెమెరా, పవర్‌ఫుల్ చిప్, AI ఫీచర్లు.. అన్నీ ఇందులో ఉన్నాయి. ఐఫోన్ SE 3 వాడుతున్నవారు, 2025లో ఐఫోన్ SE 4కి అప్‌గ్రేడ్ కావడం మంచిదే. ఎందుకంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
iPhone SE 4 is a major upgrade with iPhone 14 design, better camera, larger OLED display, powerful A18 chip, and Apple Intelligence, making it a worthwhile upgrade from SE 3.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X