ఐఫోన్ ఎక్స్.. 5 కొత్త పీచర్లు

డిజైనింగ్ పరంగా ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే, iPhone Xను పూర్తి భిన్నంగా రీడిజైన్ చేయటం జరిగింది.

|

యాపిల్ ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 సంవత్సరాల పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ iPhone X పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఐఫోన్ 10గా పిలవబడుతోన్న ఈ ఫోన్, ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే అట్రాక్టివ్ ఫీచర్లను కలిగి ఉంది. యాపిల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 5 స్పెషల్ ఫీచర్ల వివరాలు..

ఇక ఐడీ‌ప్రూఫ్ క్రింద m-Aadhaar చాలుఇక ఐడీ‌ప్రూఫ్ క్రింద m-Aadhaar చాలు

 bezel-less edge-to-edge డిస్‌ప్లే..

bezel-less edge-to-edge డిస్‌ప్లే..

డిజైనింగ్ పరంగా ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే, iPhone Xను పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. bezel-less edge-to-edge డిస్‌ప్లే, ఐఫోన్ ఎక్స్ ఫోన్‌కు ప్రధాన హైలైట్. ఈ మోడల్‌లో హోమ్ బటన్ కనిపించదు. స్టెయిన్‌లెస్ స్టీల్ బ్యాండ్స్ ఫోన్ లుక్‌నే మార్చివేసాయి. గ్లాస్ బాడీ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చింది.

 OLED స్ర్కీన్..

OLED స్ర్కీన్..

iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ OLED స్ర్కీన్. అంతేకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 5.8 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 2436 x 1125పిక్సల్స్ విత్ 458 పీపీఐ.

 FaceID..

FaceID..

iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ FaceID. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్ లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.

Animojis..

Animojis..

యాపిల్ తన iPhone X స్మార్ట్‌ఫోన్‌ ద్వారా సరికొత్త animated emojisను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిని Animojisగా యాపిల్ అభివర్ణిస్తోంది. ఈ యానిమోజిస్ అనేవి యూజర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆధారంగా సృష్టించబడతాయి. ఇందుకు అవసరమైన కస్టమ్ 3డీ వర్షన్స్‌ను FaceID ఫీచర్ సమకూరుస్తుంది.

వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్

వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్

iPhone X స్మార్ట్‌ఫోన్‌ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందుకుగాను Qi అనే స్టాండర్డ్ టెక్నాలజీని ఉపయోగించకుంటుంది. iPhone X స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసేందుకు AirPower పేరుతో ఓ మ్యాట్‌ను రూపొందిస్తున్నట్లు యాపిల్ అనౌన్స్ చేసింది.

ఖరీదైన ఫోన్..

ఖరీదైన ఫోన్..

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ ఎక్స్ (256జీబి స్టోరేజ్) వర్షన్ ధర రూ.1,02,000గా ఉంటుంది. బేసిక్ వర్షన్ ధర రూ.89,000గా ఉంటుంది.

Best Mobiles in India

English summary
iPhone X: 5 new features it brings to Apple phones. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X