Home
Mobile

iPhone Xని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి

ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చిన నేపథ్యంలో పేటీఎం కూడా వాటికి సవాల్ విసరుతూ ముందుకు దూసుకువచ్చింది.

By Hazarath Aiah

ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చిన నేపథ్యంలో పేటీఎం కూడా వాటికి సవాల్ విసరుతూ ముందుకు దూసుకువచ్చింది. ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌ సేల్‌ పేరుతో ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, మార్కెటింగ్‌ ఆఫర్లతో పేటీఎం మాల్‌ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ అభిమానుల కోసం ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేసిన ఐఫోన్‌ ఎక్స్‌(64జీబీ)ను కేవలం 67,298 రూపాయలకే విక్రయిస్తోంది. కాగా దీని అసలు ధర 92,798 రూపాయలుగా ఉంది. మరి దీన్ని 67,298 రూపాయలకే ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం.

ఫ్లాట్‌ 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌

ఫ్లాట్‌ 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌

ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌ సేల్‌లో ఐఫోన్‌ ఎక్స్‌పై ఫ్లాట్‌ 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతో ఐఫోన్‌ ఎక్స్‌(64జీబీ) పేటీఎం మాల్‌లో రూ.82,798కి అందుబాటులో ఉంది.

క్రెడిట్‌ కార్డుతో రూ.1,250 రూపాయల క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డుతో రూ.1,250 రూపాయల క్యాష్‌బ్యాక్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లు తమ క్రెడిట్‌ కార్డుతో ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే అదనంగా మరో 1,250 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది.

ఎక్స్చేంజ్‌లో రూ.14,250 తగ్గింపు

ఎక్స్చేంజ్‌లో రూ.14,250 తగ్గింపు

పాత ఫోన్ల ఎక్స్చేంజ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్‌ ఎక్స్‌ ధర మరో రూ.14,250 తగ్గుతోంది. దీంతో ఈమూడింటి మొత్తాన్ని తీసివేస్తే ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర 67,298 రూపాయలకు దిగొస్తోంది.

 ల్యాప్‌టాప్‌లపై ..

ల్యాప్‌టాప్‌లపై ..

మరోవైపు పేటీఎం మాల్‌ నిర్వహిస్తున్న సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది.

లెనోవో ఐడియాప్యాడ్‌ 320

లెనోవో ఐడియాప్యాడ్‌ 320

ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది.

డెల్‌ వోస్ట్రో 3578

డెల్‌ వోస్ట్రో 3578

ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌ కలిగిన డెల్‌ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్‌ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది.

ఎంఎస్‌ఐ జీఎల్‌63 8ఆర్‌ఈ-455ఐఎన్‌

ఎంఎస్‌ఐ జీఎల్‌63 8ఆర్‌ఈ-455ఐఎన్‌

ఎంఎస్‌ఐ జీఎల్‌63 8ఆర్‌ఈ-455ఐఎన్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్‌ తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది.

ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌

ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌

13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎంక్యూడీ42హెచ్‌ఎన్‌/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది.

సర్‌ఫేస్‌ ప్రొ కోర్‌ ఐ5

సర్‌ఫేస్‌ ప్రొ కోర్‌ ఐ5

మైక్రోసాఫ్ట్‌ సర్‌ఫేస్‌ ప్రొ కోర్‌ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Paytm Mall's Freedom cashback sale: Here's how you can get iPhone X in Rs 67,298 more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X