ఆపిల్‌ను వెంటాడుతున్న iPhone X సమస్యలు, వరుసగా రెండో సారి

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ ఆపిల్ ఐఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టి 10 వసంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా గ‌తేడాది ప్ర‌తిష్టాత్మ‌కంగా ఐఫోన్ Xను విడుద‌ల చేసిన విష‌యం విదితమే.

|

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ ఆపిల్ ఐఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టి 10 వసంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా గ‌తేడాది ప్ర‌తిష్టాత్మ‌కంగా ఐఫోన్ Xను విడుద‌ల చేసిన విష‌యం విదితమే. ఈ ఫోన్‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్లు కూడా యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ఫోన్ ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గ‌త కొద్ది రోజుల కింద‌ట ఫేస్ ఐడీ ఫీచ‌ర్‌లో ప‌లు స‌మ‌స్య‌లు రాగా ఆపిల్ వాటిని ప‌రిష్క‌రించింది. అయితే ఇప్పుడు ఐఫోన్ X లో మ‌రో కొత్త స‌మ‌స్య వ‌స్తున్న‌ద‌ని యూజ‌ర్లు గ‌గ్గోలు పెడుతున్నారు.

శాంసంగ్‌కు ఎదురుదెబ్బ,ఆపిల్‌కు రూ.3600 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశంశాంసంగ్‌కు ఎదురుదెబ్బ,ఆపిల్‌కు రూ.3600 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

ప్రొటెక్ష‌న్ గా ఏర్పాటు చేసిన గ్లాస్..

ప్రొటెక్ష‌న్ గా ఏర్పాటు చేసిన గ్లాస్..

ఐఫోన్ Xలో వెనుక భాగంలో ఉండే రెండు కెమెరాల‌కు ప్రొటెక్ష‌న్ గా ఏర్పాటు చేసిన గ్లాస్ ఏమీ చేయ‌కుండానే, కింద ప‌డ‌కున్నా, దేనికీ తాక‌కున్నా దానంత అటే ప‌గులుతున్న‌ద‌ట‌.

ప‌లువురు యూజర్లు..

ప‌లువురు యూజర్లు..

ఇదే విషయాన్ని ప‌లువురు యూజర్లు రెడ్డిట్‌తోపాటు ఆపిల్ స‌పోర్ట్ ఫోరమ్స్‌లోనూ పోస్ట్ చేస్తున్నారు. త‌మ ఐఫోన్ X ఫోన్ల‌లో వెనుక కెమెరాల‌కు ఏర్పాటు చేసిన ప్రొటెక్ష‌న్ గ్లాస్ ప‌గులుతున్న‌ద‌ని వారు వాపోతున్నారు.

దానంత‌ట అదే..

దానంత‌ట అదే..

ఏమీ చేయ‌కున్నా దానంత‌ట అదే ఆ గ్లాస్ ప‌గులుతుంద‌ని వారు చెబుతున్నారు. అయితే ఎందుకు ఈ గ్లాస్‌ పగిలిపోతుందో సరియైన కారణం మాత్రం తెలియడం లేదు. తమ ఫోన్లను కింద పడేయలేదని, దానికదే పగిలిపోతుందని యూజర్లు పేర్కొంటున్నారు.

వాతార‌ణంలో మార్పులు..

వాతార‌ణంలో మార్పులు..

కానీ వాతార‌ణంలో మార్పులు, ఉష్ణోగ్ర‌త‌ల‌లో హెచ్చు త‌గ్గుల కార‌ణంగానే ఆ గ్లాస్ ప‌గులుతున్న‌ద‌ని ప‌లువురు భావిస్తున్నారు. చల్లని వాతావరణంతో మనిషి చేతులు, కాళ్లు పగిలినట్టు, ఫోన్‌ వెనుక వైపు కెమెరా గ్లాస్‌ ప్రొటెక్షన్‌​ కూడా చల్లని వాతావరణానికి దెబ్బతింటుందని పలువురు యూజర్లు విశ్వసిస్తున్నారు.

ప్యాంటు, చొక్కా జేబుల్లో పెట్టుకున్న‌ప్పుడు..

ప్యాంటు, చొక్కా జేబుల్లో పెట్టుకున్న‌ప్పుడు..

దీంతోపాటు ​ఐఫోన్ X ఫోన్ ను ప్యాంటు, చొక్కా జేబుల్లో పెట్టుకున్న‌ప్పుడు వాటిల్లో ఇత‌ర వ‌స్తువులు ఉంటే వాటికి తగిలి కూడా ఆ గ్లాస్ ప‌గ‌ల‌వ‌చ్చ‌ని మ‌రికొంద‌రు అంటుండ‌గా, స‌ద‌రు గ్లాస్ సఫైర్ గ్లాస్ టైప్‌కు చెందింద‌ని, అంత సుల‌భంగా ప‌గిలే అవ‌కాశం ఉండ‌ద‌ని, అందుకు వేరే ఏదైనా కార‌ణం ఉండి ఉండ‌వ‌చ్చ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

ఐఫోన్‌ మోడల్స్‌కు సఫైర్‌ గ్లాస్‌ కవర్‌

ఐఫోన్‌ మోడల్స్‌కు సఫైర్‌ గ్లాస్‌ కవర్‌

ఐఫోన్‌ 7 నుంచి ఆపిల్‌ తన ఐఫోన్‌ మోడల్స్‌కు సఫైర్‌ గ్లాస్‌ కవర్‌ను వాడుతోంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటోంది. కానీ ఎందుకు పగులుతుందో మాత్రం సరియైన క్లారిటీ తెలియడం లేదు.

వారెంటీ కిందకి వస్తుందో రాదో..

వారెంటీ కిందకి వస్తుందో రాదో..

అయితే పగిలిపోయిన ఈ కెమెరా గ్లాస్‌కు వారెంటీ కిందకి వస్తుందో రాదో కూడా అనుమానమే. మ‌రి ఈ స‌మ‌స్య‌పై ఆపిల్ స్పందిస్తుందా, ప‌గిలిన గ్లాస్‌కు వారంటీ ఇస్తుందా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Best Mobiles in India

English summary
iPhone X's Dual Camera Glass Cracks Easily, Some Users Report More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X