Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 6 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 9 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Sports
భారత్ తొండాట ఆడకుంటే ఆస్ట్రేలియాదే విజయం: మాజీ క్రికెటర్
- News
Telangana gets zero: సిటీలో మోడీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ పోస్టర్లు!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆపిల్‌కు పండగ, అమ్మకాల్లో ఆఫోన్ ఒక్కటే దుమ్మురేపింది
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్‌కు గుడ్‌న్యూస్ అందింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ ఈ వారంలో ప్రకటించిన త్రైమాసికపు ఫలితాల్లో బెస్టింగ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.ఐఫోన్ ఎక్స్ విక్రయాల్లో ఎలా వెళుతుందోనని సందేహపడిన మార్కెట్ విశ్లేషకుల అంచనాలను బద్దలు కొడుతూ 2018 తొలి క్వార్టర్‌లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ ఎక్స్ నిలిచినట్టు కంపెనీ ప్రకటించింది.ఈ త్రైమాసికంలో 16 మిలియన్ యూనిట్ల ఐఫోన్ ఎక్స్‌లను రవాణా చేసినట్టు సీనెట్ రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్ చేసిన ఐఫోన్ 8 కేవలం 12.5 మిలియన్ యూనిట్లు మాత్రమే రవాణా జరుగగా.. ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8.3 మిలియన్ యూనిట్లు రవాణా జరిగింది. ఆపిల్ ప్రకటించిన ఈ ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను కూడా బీట్ చేశాయి. అయితే భారత మార్కెట్‌లో మాత్రం ఆపిల్ మార్కెట్ షేరు తగ్గింది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో..
2018 తొలి క్వార్టర్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో శాంసంగ్ కంపెనీ ఆధిపత్యంలో నిలిచినట్టు రెండు మార్కెట్ రీసెర్చ్ రిపోర్టులు పేర్కొన్నాయి. అదనంగా సీబీఐ(పూర్తిగా నిర్మించిన యూనిట్లు)పై దిగుమతి డ్యూటీలను పెంచడం, భారత్‌లో ఐఫోన్ ధరలపై ప్రభావం పడింది.

ఐఫోన్ ఎక్స్, ఐఫోన్8, 8 ప్లస్ లాంచ్‌తో..
భారత మార్కెట్‌లో తన ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం ఆపిల్, ప్రభుత్వంతో చర్చించింది. కాగ, గత క్వార్టర్‌లో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్8, 8 ప్లస్ లాంచ్‌తో ఆపిల్ టాప్‌లో నిలిచింది. కానీ కంపెనీ నుంచి భారత్‌కు సరుకు రవాణా 74 శాతం తగ్గింది.

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 5 స్పెషల్ ఫీచర్ల వివరాలు.
bezel-less edge-to-edge డిస్‌ప్లే..
డిజైనింగ్ పరంగా ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే, iPhone Xను పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. bezel-less edge-to-edge డిస్‌ప్లే, ఐఫోన్ ఎక్స్ ఫోన్‌కు ప్రధాన హైలైట్. ఈ మోడల్‌లో హోమ్ బటన్ కనిపించదు. స్టెయిన్‌లెస్ స్టీల్ బ్యాండ్స్ ఫోన్ లుక్‌నే మార్చివేసాయి. గ్లాస్ బాడీ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చింది.

OLED స్ర్కీన్..
iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ OLED స్ర్కీన్. అంతేకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 5.8 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 2436 x 1125పిక్సల్స్ విత్ 458 పీపీఐ.

FaceID..
iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ FaceID. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్ లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.

Animojis..
ఆపిల్ తన iPhone X స్మార్ట్‌ఫోన్ ద్వారా సరికొత్త animated emojisను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిని Animojisగా యాపిల్ అభివర్ణిస్తోంది. ఈ యానిమోజిస్ అనేవి యూజర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆధారంగా సృష్టించబడతాయి. ఇందుకు అవసరమైన కస్టమ్ 3డీ వర్షన్స్‌ను FaceID ఫీచర్ సమకూరుస్తుంది.

వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్
iPhone X స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందుకుగాను Qi అనే స్టాండర్డ్ టెక్నాలజీని ఉపయోగించకుంటుంది. iPhone X స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసేందుకు AirPower పేరుతో ఓ మ్యాట్‌ను రూపొందిస్తున్నట్లు యాపిల్ అనౌన్స్ చేసింది.

ఐఫోన్ ఎక్స్ ఫీచర్ల విషయానికొస్తే..
5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470