మరో 3 రోజుల్లో ఐఫోన్ X ఆర్డర్లు, రూ. 89 వేలతో మార్కెట్లోకి, సత్తా ఎంత ?

ఇటీవల అట్టహాసంగా జరిగిన ఆపిల్ ఈవెంట్లో తన ప్రతిష్టాత్మక ఐఫోన్ X ను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే..

By Hazarath
|

ఇటీవల అట్టహాసంగా జరిగిన ఆపిల్ ఈవెంట్లో తన ప్రతిష్టాత్మక ఐఫోన్ X ను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. కాగా ఆ ఫోన్ ఫ్రీ ఆర్డర్లు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి భారత్‌తో సహా మొత్తం 55 దేశాల్లో ప్రీ ఆర్డర్లు షురూ అవనున్నాయి. ఇక ఈ-కామర్స్ సైట్లయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ అదే రోజున ఐఫోన్ X కు ప్రీ ఆర్డర్లు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.

5జీ దెబ్బ..ఇకపై పెరగనున్న ఇంటర్నెట్ వేగం5జీ దెబ్బ..ఇకపై పెరగనున్న ఇంటర్నెట్ వేగం

ఐఫోన్ X ఫీచర్లు

ఐఫోన్ X ఫీచర్లు

5.8 ఇంచ్ ఓలెడ్ సూపర్ రెటీనా టచ్ స్క్రీన్ డిస్‌ప్లే
2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆపిల్ ఎ11 బయానిక్ చిప్‌సెట్
3జిబి ర్యామ్, 64/256 ఇంటర్నల్ స్టోరేజి, విస్తరణ సామర్ధ్యం లేదు
12 ఎంపీ ప్రైమరీ రేర్ డ్యూయెల్ కెమెరా, 7 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ సిమ్ సపోర్ట్
2716mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ, బరువు 174 గ్రాములు
డాల్బీ విజన్, ఫేస్ ఐడీ, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ,
ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్

ధర

ధర

భారత్‌లో ఐఫోన్ X 64జీబీ ధర రూ.89వేలు ఉండగా, 256 జీబీ వేరియెంట్ ధర రూ.1.02 లక్షలుగా ఉంది. ప్రీ ఆర్డర్ల ద్వారా ఫోన్లను కొన్నవారికి నవంబర్ 3వ తేదీ నుంచి వాటిని డెలివరీ అందివ్వనున్నారు. సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో ఐఫోన్ X యూజర్లకు లభించనుంది. పూర్తి స్థాయి అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఫోన్‌ను తయారు చేశారు.

 డిస్‌ప్లే
 

డిస్‌ప్లే

ఐఫోన్ Xలో బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ రకమైన డిస్‌ప్లే ద్వారా ఫోన్ తెర క్వాలిటీ పెరిగి స్పష్టమైన క్రిస్టల్ క్లియర్ దృశ్యాలను వీక్షించవచ్చు. దీంతో పాటు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ ఉండటంతో ఫోన్ మీద ఎటువంటి గీతలు పడవు.

 డిజైన్

డిజైన్

ఐఫోన్ Xలో పూర్తిగా హోమ్ బటన్‌ను తీసివేశారు. ఐఫోన్ 7 ప్లస్ వెనుక భాగంలో కెమెరాలను పక్కపక్కనే ఇవ్వగా ఐఫోన్ Xలో మాత్రం ఒకదాని కింద ఒకటి ఇచ్చారు. ఫ్లాష్ లైట్, మైకులు ఇంతకుముందు ఉన్న ఫోన్లకు ఉన్నట్లుగానే ఉంటాయి.

 కెమెరా

కెమెరా

12 ఎంపీ ప్రైమరీ రేర్ డ్యూయెల్ కెమెరా, 7 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చింది. f/1.8 అపర్చర్ సైజ్‌ను కలిగి ఉండడం వల్ల ఈ కెమెరాలతో తీసిన ఫొటోలు, వీడియోలు చాలా క్వాలిటీతో వస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ తో ఫొటోలు, వీడియోలు షేక్ కావు. కె అల్ట్రాహెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ సపోర్ట్ ఉంది.ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను రికార్డ్ చేసే సౌకర్యం కూడా ఉంది.

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్

ఐఫోన్ Xలో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఇవ్వడంతో ఫోన్ నీరు పడినా, దుమ్ము పడినా అంత సులభంగా దెబ్బతినదు, పాడవ్వదు. 1.5 మీటర్ల లోతులో సుమారు 30 నిమిషాల పాటు ఫోన్‌ను ఉంచినా అందులోకి నీరు చేరదు. దీంతో ఫోన్ నీటికి పాడైపోతుందనే బెంగ అక్కర్లేదు. వర్షం పడుతున్నా నిరభ్యంతరంగా ఫోన్‌ను వాడుకోవచ్చు.

ఆపిల్ పే

ఆపిల్ పే

ఫోన్ Xలో ఆపిల్ పే యాప్‌ ఉంది. దీని ద్వారా వీసా, మాస్టర్‌కార్డు, అమెక్స్ కార్డు హోల్డర్లు కార్డ్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. యూజర్లు డివైస్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి ఫోన్‌ను లాక్, అన్‌లాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఫేస్ ఐడీ ద్వాకా ఆపిల్ పే ద్వారా పేమెంట్లు, యాప్ స్టోర్‌లో యాప్ కొనుగోళ్లు, యాప్ లాక్, అన్‌లాక్‌ లాంటివి చేసుకోవచ్చు. ఫేస్ ఐడీ ఫీచర్ ఉండటంతో ఆపిల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్లో తీసివేసింది.

Best Mobiles in India

English summary
iPhone X India Pre-Orders Open on October 27, Price Starts at Rs. 89,000 Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X