ఐఫోన్ ఎక్స్ కోనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్...

Posted By: BOMMU SIVANJANEYULU

యాపిల్ ఉత్పత్తుల పై భారీ క్యాష్‌బ్యాక్‌లకు తెరతీస్తూ యాపిల్ ఐండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో నిర్వహించబడుతోన్న ఈ లిమిటెడ్ ఎడిషన్ సేల్ భాగంగా తన ఐఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్ ఇంకా యాపిల్ వాచీల పై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను యాపిల్ అందిస్తోంది. EMIs రూపంలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఆఫ్‌లైన్‌లో కొనుగోళ్ల పై మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్‌ అనేది వర్తిస్తుందని యాపిల్ తెలిపింది. యూజర్ కు వర్తించిన క్యాష్ బ్యాక్ 90 రోజుల్లోపు వారి అకౌంట్‌లో జమ చేయబడుతుందని యాపిల్ ఇండియా తెలిపింది.

ఐఫోన్ ఎక్స్ కోనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్...

13 శాతం వడ్డీతో..
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే యూజర్లు 6 నెలలు లేదా 9 నెలల ఈఎమ్ఐ స్కీమ్‌ను ఎంచుకున్నట్లయితే వడ్డీ 13 శాతం గానూ 8 నెలలు లేదా 24 నెలల ఈఎమ్ఐ స్కీమ్‌ను సెలక్ట్ చేసుకునే వారికి 15 శాతం వడ్డీ పై ఈ వస్తువులు అందించబడతాయని యాపిల్ ఇండియా తెలిపింది.

T159 పేరుతో Apple సీక్రెట్ ప్రాజెక్ట్, శాంసంగ్, LGలే ప్రధాన టార్గెట్ !

ఐఫోన్ ఎక్స్ కోనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్
ఈ క్యాష్‌బ్యాక్ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకుని ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసే వారికి రూ.10,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇదే ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 8 ఇంకా ఐఫోన్ 8 ప్లస్‌లను కొనుగోలు చేసేవారికి రూ.8,000, ఐఫోన్ 7 ఇంకా ఐఫోన్ 7 ప్లస్‌లను కొనుగోలు చేసినవారికి రూ.4000, ఐఫోన్ 6ఎస్ ఇంకా ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లను కొనుగోలు చేసినవారికి రూ.3000,

మ్యాక్‌బుక్స్ పై రూ.10,000 క్యాష్‌బ్యాక్‌..
ఐఫోన్ ఎస్ఈ ఇంకా ఐఫోన్ 6లను కొనుగోలు చేసే వారికి రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇదే క్యాష్‌బ్యాక్ సేల్‌లో భాగంగా యాపిల్ వాచీలతో పాటు ఐప్యాడ్స్ పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను యాపిల్ ప్రొవైడ్ చేస్తోంది. ఇదే సమయంలో మ్యాక్‌బుక్స్ పై రూ.10,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

English summary
iPhone X selling with Rs 10,000 cashback & iPhone 8, iPhone 8 Plus with Rs 8,000, but for a limited period
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot