నెలకి రూ. 4,499 కట్టండి, కొత్త ఐఫోన్ XS సొంతం చేసుకోండి

టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ఉన్న అధికారిక డిస్ట్రిబ్యూటర్స్‌లో ఇండియాస్టోర్‌.కామ్ ఒకటి‌ అన్న విషయం అందరికీ తెలిసిందే.

|

టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ఉన్న అధికారిక డిస్ట్రిబ్యూటర్స్‌లో ఇండియాస్టోర్‌.కామ్ ఒకటి‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సైటు ద్వారా ఆపిల్ కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి కంపెనీ శుభవార్తను అందించింది. ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఆపిల్‌ ఇటీవల లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు లో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో పాటు ఎయిర్‌టెల్‌, జియో, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా వీటిని ఆపిల్ విక్రయానికి ఉంచుతుంది. ఆసక్తి గల కస్టమర్లు ముందస్తుగా ఈ ఫోన్లను బుక్‌చేసుకోవాలని ఆపిల్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఇండియాస్టోర్‌.కామ్‌ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది.

అనుకోని సమయంలో ల్యాపీలపై భారీ డిస్కౌంట్లుఅనుకోని సమయంలో ల్యాపీలపై భారీ డిస్కౌంట్లు

 ఐఫోన్‌ xs(64జీబీ)

ఐఫోన్‌ xs(64జీబీ)

నెలకు రూ.4,999 చొప్పున 24 నెలల పాటు చెల్లించి, ఐఫోన్‌ xs(64జీబీ) వేరియంట్‌ను ఇండియాస్టోర్‌.కామ్ ద్వారా సొంతం చేసుకోవచ్చని ఆపిల్ తెలిపింది.

రూ.1,07,976

రూ.1,07,976

కాగా ఈ ఫోన్ మీద విధించే వడ్డీరేటు అనంతరం ఐఫోన్‌ xs( జీబీ) ధర రూ.99,900 నుంచి రూ.1,07,976కు పెరుగుతుందని కంపెనీ పేర్కొంది.

ఐఫోన్‌ XS(256జీబీ)

ఐఫోన్‌ XS(256జీబీ)

అదేవిధంగా ఐఫోన్‌ XS(256జీబీ) వేరియంట్‌ను కూడా 24 నెలల పాటు నెలకు రూ.5,175 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది.

రూ.1,24,200
 

రూ.1,24,200

దీనిపై విధించే వడ్డీరేటుతో కూడా ఐఫోన్‌ XS(256జీబీ) వేరియంట్‌ ధర కూడా రూ.1,14,900 నుంచి రూ.1,24,200కు పెరుగుతుందని తెలిపింది.

ఐఫోన్‌ XS(512జీబీ)

ఐఫోన్‌ XS(512జీబీ)

ఐఫోన్‌ XS(512జీబీ) వేరియంట్‌ కూడా నెలకు రూ.6,076 చెల్లించడంతో కొనుగోలుదారులకు సొంతమవుతుంది. మిగతా మొత్తాన్ని 24 నెలల్లో చెల్లించాలి.

 ఐఫోన్‌ XS మ్యాక్స్‌

ఐఫోన్‌ XS మ్యాక్స్‌

అదేవిధంగా ఐఫోన్‌ XS మ్యాక్స్‌ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లను కూడా నెలకు 4,999 రూపాయలు, 5,678 రూపాయలు, 6,587 రూపాయలు చొప్పున 24 నెలల పాటు చెల్లించి తమ సొంతం చేసుకోవచ్చు.

సెప్టెంబర్‌ 28 నుంచి..

సెప్టెంబర్‌ 28 నుంచి..

సెప్టెంబర్‌ 28 నుంచి ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌లు భారత్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇండియాస్టోర్‌ సైట్‌ కౌంట్‌డౌన్‌..

ఇండియాస్టోర్‌ సైట్‌ కౌంట్‌డౌన్‌..

ఈ రెండు హ్యాండ్‌సెట్లను విడుదల చేయడానికి ఇండియాస్టోర్‌ సైట్‌ కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభించింది. 24 నెలల టెన్యూర్‌తో లో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను ఇండియాస్టోర్‌.కామ్‌ అందుబాటులోకి తెచ్చింది.

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

వీటిపై యాక్సిస్‌బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, సిటీ క్రెడిట్‌ కార్డులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనుంది.

నాన్‌-ఈఎంఐ లావాదేవీలకు..

నాన్‌-ఈఎంఐ లావాదేవీలకు..

నాన్‌-ఈఎంఐ లావాదేవీలకు ఐదింతల రివార్డు పాయింట్లు లభిస్తాయి. లావాదేవీ జరిపిన 150 బిజినెస్‌ గంటల్లో క్యాష్‌బ్యాక్‌ కొనుగోలుదారులకు అందుతుంది.

 

Best Mobiles in India

English summary
iPhone XS Available in India at Rs. 4,499 a Month more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X