ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.32 వేలు, అమ్మేది మాత్రం లక్షా నలభై వేలకి !

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఇటీవలే తన నూతన ఐఫోన్లు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ ఫోన్లను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

|

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఇటీవలే తన నూతన ఐఫోన్లు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ ఫోన్లను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పలు దేశాల్లో ఇప్పటికే ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లకు గాను విక్రయాలు ప్రారంభమయ్యాయి. కాగా భారత్‌లో ఈ నెల 28వ తేదీ నుంచి ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లను విక్రయించనున్నారు. అయితే ప్రతి సారీ నూతన ఐఫోన్లు విడుదలైనప్పుడల్లా టెక్ ఇన్‌సైట్స్ అనే సంస్థ ఆ ఫోన్లను పార్ట్‌లుగా విడదీసి ఏ పార్ట్ ఖరీదు ఎంతో లెక్కిస్తుంది. అనంతరం ఐఫోన్ తయారీకి అయిన అసలు ఖర్చును తెలియజేస్తుంది.

రోజుకు రూ.300 కోట్లు, ఉచితంతో ఊడ్చుకుపోయిందెక్కడ ?రోజుకు రూ.300 కోట్లు, ఉచితంతో ఊడ్చుకుపోయిందెక్కడ ?

 టెక్ ఇన్‌సైట్స్ సంస్థ

టెక్ ఇన్‌సైట్స్ సంస్థ

అందులో భాగంగానే ఈ సారికి కూడా టెక్ ఇన్‌సైట్స్ సంస్థ తాజాగా విడుదలైన ఐఫోన్ Xఎస్ మ్యాక్స్‌కు చెందిన 256 జీబీ వేరియెంట్‌ను పార్ట్‌లుగా ఊడదీసి ఆ ఫోన్ తయారీకి అయ్యే అసలు ఖర్చును వెల్లడించింది.

తయారీ ఖర్చు

తయారీ ఖర్చు

ఈ క్రమంలో ఐఫోన్ Xఎస్ మ్యాక్స్ 256 జీబీ వేరియెంట్ తయారీకి 443 డాలర్లు (దాదాపుగా రూ.32వేలు) మాత్రమే ఖర్చయిందని తెలిపింది.

1249 డాలర్లకు

1249 డాలర్లకు

కానీ ఆ ఫోన్‌ను మార్కెట్‌లో ఆపిల్ 1249 డాలర్లకు విక్రయిస్తున్నది. అంటే దాదాపుగా 3 రెట్లు ఎక్కువ రేటును ఆపిల్ వసూలు చేస్తున్నదన్నమాట.

భార‌త్‌లో ..

భార‌త్‌లో ..

ఐఫోన్ Xఎస్ మ్యాక్స్ 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర భార‌త్‌లో రూ.1,24,900 గా ఉంది.ఇతర దేశాల్లో మాత్రం లక్షా నలభై వేలుగా ఉంది.

ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫీచ‌ర్లు

ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫీచ‌ర్లు

ఐఫోన్ Xఎస్ - 5.8 ఇంచ్ ఓలెడ్ సూప‌ర్ రెటీనా హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 2436 x 1125 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఐఫోన్ Xఎస్ మ్యాక్స్ - 6.5 ఇంచ్ ఓలెడ్ సూప‌ర్ రెటీనా హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 2688 x 1245 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఆపిల్ ఎ12 బ‌యోనిక్ ప్రాసెస‌ర్‌, 64/256/512 జీబీ స్టోరేజ్‌, ఐఓఎస్ 12, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 7 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ ఐడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, వైర్‌లెస్ చార్జింగ్‌, ఫాస్ట్ చార్జింగ్‌.

ఐఫోన్ Xఆర్ ఫీచ‌ర్లు

ఐఫోన్ Xఆర్ ఫీచ‌ర్లు

6.1 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1792 x 828 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, యాపిల్ ఎ12 బ‌యోనిక్ ప్రాసెస‌ర్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఐఓఎస్ 12, ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 7 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ ఐడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, వైర్‌లెస్ చార్జింగ్‌, ఫాస్ట్ చార్జింగ్‌.

కెమెరా.

కెమెరా.

ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫోన్ల‌లో రెండింటిలోనూ వెనుక భాగంలో 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 7 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.ఐఫోన్ Xఆర్ లో వెనుక భాగంలో 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సింగిల్ కెమెరాను అమర్చారు. ముందు భాగంలో య‌థావిధిగా 7 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Best Mobiles in India

English summary
iPhone XS Max 256GB priced at Rs 1.45 lakh in India, costs only Rs 32,000 to make: Reports more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X