Home
Mobile

ఆపిల్‌ సంస్థ కీలక ప్రకటన.. బడ్జెట్‌లో ప్రకటన అనుగుణంగా ఐఫోన్‌ల ధరలు గరిష్ఠంగా రూ.5,900 తగ్గింపు..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఐఫోన్‌ల ధరలను తగ్గించింది. వివిధ మోడళ్లు, సిరీస్‌లపై 3-4 శాతం తగ్గింపును ప్రకటన చేసింది. ఐఫోన్ SE నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్‌ 15 సిరీస్‌ వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024 లో బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీని తగ్గించింది. ఈ మేరకు ఆపిల్‌ తగ్గింపు నిర్ణయాన్ని (Apple Announced Price Cut on iphones) తీసుకుంది.

ఆపిల్‌ తీసుకున్న తాజా తగ్గింపు నిర్ణయంతో ఐఫోన్‌ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ.5100, అదే ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ధర రూ.5900 తగ్గింది. ఈ రెండు మోడళ్లు విడుదల అయిన తర్వాత తొలిసారి ధరలు తగ్గాయి. ఐఫోన్‌ 13, 14, 15 మోడళ్లను ఆపిల్‌ దేశీయంగా తయారుచేస్తోంది. అయితే ప్రో, ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రం దిగుమతి చేసుకుంటోంది.

apple announced price cut on iphones

ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 15 మిలిగిన మోడళ్ల ధర రూ.300 తగ్గింది. అదే ఐఫోన్‌ SE ధర మాత్రం రూ.2300 వరకు తగ్గింది. కేంద్ర బడ్జెట్‌లో మొబైల్‌ ఫోన్లపై ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. దిగుమతి చేసుకొనే స్మార్ట్‌ఫోన్‌లపై 20 శాతం కస్టమ్స్‌ డ్యూటీ, 2 శాతం సర్‌ఛార్జీ ఉంటుంది. దీనికి అదనంగా 18 శాతం GST చెల్లించాల్సి వచ్చింది.

అయితే తాజాగా బడ్జెట్‌లో చేసిన ప్రకటనతో కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతం, సర్‌ఛార్జీ 1.5 శాతానికి తోడుగా 18 శాతం GST ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే దేశంలోనే తయారు చేసిన స్మార్ట్‌ఫోన్‌లకు 18 శాతం GST మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తుల ధరల తగ్గింపు తక్కువగానే ఉంటుంది.

తగ్గింపు అనంతరం ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్‌ SE ధర రూ.47,600 గా ఉంది. అదే ఐఫోన్‌ 13 ధర రూ.59,600, ఐఫోన్‌ 14 ధర రూ.69,600, ఐఫోన్ 14 ప్లస్‌ ధర రూ.79,600 గా ఉంది. ఈ ధరలన్నీ బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా ఉన్నాయి. బ్యాంకు సహా ఇతర తగ్గింపు ధరలతో మరింత తగ్గింపును పొందే అవకాశం ఉంది.

ఆపిల్‌ అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా ఐఫోన్‌ 15 ప్రో ధర రూ.1,29,800 గా ఉంది. అదే ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,54,000 గా ఉంది. ఈ కొత్త ధరలను యాపిల్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది. ఈ ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లు కొనుగోలు చేసే వారికి ఈ తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iphones price slashed due to basic customs duty reduction announcement on budget 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X