‘ఐపీఎల్-5’ సందడంతా మీ వెంటే!!

Posted By: Prashanth

‘ఐపీఎల్-5’ సందడంతా మీ వెంటే!!

 

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్- 5 కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అడుగడుగునా ఉత్కంఠకు లోనే చేసే ఈ పొట్టి క్రికెట్ పోటీలను ఏ మాత్రం మిస్ కాకుండా ఇంటిల్లిపాది చూస్తారు. సరిగ్గా మ్యాచ్ సమయంలోనే బయటకు వెళ్లాల్సి వస్తే..?, ఆ ఉత్కంఠ భరిత క్షణాలను మిస్ కావల్సి వస్తుందని ఫీల్ అవకండి. ఐపీఎల్ డగ్‌అవుట్ అప్లికేషన్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో అప్‌డేట్ చేసుకుంటే సరి.. ‘ఐపీఎల్-5’ సందడంతా మీ వెంటే. వాడి వేడి క్రికెట్ సమాచారాన్ని ఐపీఎల్ డగ్‌అవుట్ అప్లికేషన్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ కు చేరవేస్తుంది.

ఐపీఎల్ -5 డగ్ అవుట్ అప్లికేషన్ ప్రధాన ఫీచర్లు:

* స్కోర్ వివరాలను ప్రత్యక్షంగా తిలకించే సౌలభ్యత, అదే విధంగా వాయిస్ అవుట్ పుట్ ద్వారా వినొచ్చు

* మ్యాచ్ షెడ్యూల్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది,

* జట్ల పాయింట్ల పట్టిక అదే విధంగా ర్యాకింగ్స్, వివరాణత్మకమైన స్కోర్ బోర్డును మీ ముందు ఉంచుతుంది,

* పాత ఎడిషన్ ఐపీఎల్ వివరాలను పొందవచ్చు,

* ఐపీఎల్‌‍కు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారలు ఐపీఎల్ డగ్‌అవుట్ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గుగూల్ ప్లే నుంచి సైతం ఈ అప్లికేషన్‌ను పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot