50MP + 50MP + 64MP కెమెరాలు, 6.78 అంగుళాల డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.11,000 డిస్కౌంట్..!
ఐకూ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌లో ఐకూ 12 5G (iQOO 12 5G Smartphone) కూడా ఉంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లే, 256GB, 152GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు.
ధర, సేల్ వివరాలు :
ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.52999 గా ఉండేది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.57999 గా ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం అమెజాన్‌లో (Amazon) 12GB ర్యామ్ వేరియంట్‌ను రూ.41999 కే కొనుగోలు చేయవచ్చు. 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.46999 గా ఉంది. అంటే విడుదల సమయంలో ఉన్న ధరతో పోలిస్తే ప్రస్తుతం రూ.11000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకొనేవారికి ఇది మంచి అవకాశం.
ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 ను కలిగి ఉంది. మరియు 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. Adreno 750 GPU మరియు గరిష్ఠంగా 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల క్వాడ్ HD LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1200Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్ ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని లేకుండా SGS సర్టిఫికేషన్‌తో Low blue Light ఫీచర్‌ను కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
ఈ ఐకూ 12 హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. f/1.7 అపేచర్‌తో 1/1.3 అంగుళాల 50MP OmniVision OV50H ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) లెన్స్‌ను కలిగి ఉంది.
దీంతోపాటు f/2.0 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, f/2.6 అపేచర్, 3X ఆప్టికల్ జూమ్, 100X హైబ్రిడ్ జూమ్‌తో 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.5 అపేచర్‌తో 16MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్ 5.4, IR, NFC, GPS, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్, యాంబియంట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 120W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ నాలుగు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని ఐకూ తెలిపింది. ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ లెజెండ్, ఆల్ఫా కలర్ వేరియంట్‌లో లభిస్తోంది.


Click it and Unblock the Notifications








