50MP + 64MP + 50MP కెమెరాలు, 16GB ర్యామ్, 6.78 అంగుళాల డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.7000 డిస్కౌంట్!
భారత్ మార్కెట్‌లో ఐకూ డిమాండ్ ఉన్న బ్రాండ్‌గా మారింది. ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఐకూ ప్రీమియం ఫోన్‌లలో ఒకటిగా ఉన్న ఐకూ 12 హ్యాండ్‌సెట్‌ను (iQOO 12 5G Smartphone) ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP + 64MP+ 50MP ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. విడుదల ధరతో పోలిస్తే సుమారు రూ.8000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. విడుదల సమయంలో 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.52999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.45,999 కే కొనుగోలు చేయవచ్చు.

అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో ధర రూ.57,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.50,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు కూపన్ డిస్కౌంట్ ద్వారా అదనంగా రూ.2,000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.43,999 గా ఉంటుంది.
దీంతోపాటు ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, IDFC, HSBC, ఫెడరల్ బ్యాంకు కార్డులపై మరో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ లెజెండ్, అల్పా రంగుల్లో లభిస్తుంది. అంటే సుమారు రూ.4000 డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది. ఐకూ ప్రీమియం ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.
ఐకూ 12 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఐకూ 12 హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల క్వాడ్ HD (1260*2800 పిక్సల్స్) LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 1200Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ఐకూ హ్యాండ్‌సెట్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ Adreno 750 GPU మరియు 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 ను కలిగి ఉంది. ఈ ఫోన్ మెరుగైన వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఐకూ 12 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS, f/1.7 అపేచర్‌తో 1/1.3 అంగుళాల 50MP OmniVision OV50H లెన్స్‌ను కలిగి ఉంది. f/2.0 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ను అమర్చి ఉంది.
వీటితోపాటు f/2.6 అపేచర్, 3X ఆప్టికల్ జూమ్, 100X హైబ్రిడ్ జూమ్‌తో 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు సూపర్ మూన్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ f/2.5 అపేచర్‌తో 16MP కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రిసిస్టెన్స్‌ను కలిగి ఉంది. భద్రత కోసం అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 7, GPS, NFC, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, USB-2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రాక్సిమిటీ, కంపాస్, యాంబియంట్ కలర్, గైరోస్కోప్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








